these 55 inch 4K smart tv available at 43 inch tv price from flipkart
బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ఒకటి ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ టీవీ ఎంత చవక ధరకు లభిస్తుందంటే, కేవలం 43 ఇంచ్ టీవీ ధరకే 55 ఇంచ్ 4K Smart Tv లభిస్తుంది. అయితే, ఇది అన్ని టీవీల కోసం మాత్రం కాదు. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఒక బెస్ట్ టీవీ మాత్రమే ఈ రేటుకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
ఫ్లిప్ కార్ట్ ఈరోజు బె బెస్ట్ డీల్ ఆఫర్ చేస్తోంది. అదేమిటంటే, Daiwa రీసెంట్ గా విడుదల చేసిన 5 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (D55U4WOS) పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 60% అతి భారీ డిస్కౌంట్ అందించింది. ఈ భారీ డిస్కౌంట్ దెబ్బకి ఈరోజు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,499 డిస్కౌంట్ ధరకే లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ డైవా 55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC డెబిట్ కార్డ్ ఆప్షన్ తో 6 నెల EMI ఆఫర్ తో కొనుగోలు చేసే ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ డైవా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
Also Read: Lava Shark 5G: రూ. 7,999 ధరలో వచ్చిన లావా 5జి టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ డైవా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ LG WebOS పై నడుస్తుంది మరియు ThinQ AI మరియు మిరాక్యాస్ట్ వంటి LG ప్రత్యేక,మైన ఫీచర్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 1.5 GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ డైవా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రెండు ఇన్ బిల్ట్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 24 W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్ మరియు మరిన్ని సపోర్ట్ కలిగి ఉంటుంది.