బహుశా ఇంత చవక ధరకు లభించే 50 ఇంచ్ Smart Tv ఇంకోటి లేదేమో అనేంత చవక ధరలో బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఎంత తక్కువ ధరకు లభిస్తుందంటే, కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే ఈ బ్రాండ్ న్యూ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ డీల్ ఎక్కడ లభిస్తుంది మరియు ఫీచర్లు ఏమిటో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా.
2023 చివరిలో KODAK యొక్క CA Pro సిరీస్ నుంచి లాంచ్ చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు బిగ్ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 45% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ దెబ్బకి ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,999 రూపాయల అతి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ తర్వాత ఇదే అతి తక్కువ ధరగా నిలుస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ టీవీని HDFC మరియు BOBCARD EMI తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,499 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ ప్రైస్ లో 43 ఇంచ్ స్మార్ట్ టీవీలు మాత్రమే లభిస్తుండగా, ఈ టీవీ మాత్రం 50 ఇంచ్ సైజులో లభిస్తుంది.
Also Read: Alcatel V3 Pro 5G: ఈరోజు నుంచి మొదలైన ఆల్కాటెల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్.!
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన 50 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 500 నిట్స్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ ప్రోసెసర్ మరియు 2GB ర్యామ్ తో స్మూత్ గా పని చేస్తుంది.
సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ లో రెండు బాక్స్ స్పీకర్లు ఉంటాయి మరియు టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Digital Plus సౌండ్ టెక్నాలాజి సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ లో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు AV ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.