Smart Tv prices reduced by GST 2.0 Effect
GST 2.0 Effect: ప్రభుత్వం కొత్తగా అందించిన జీఎస్టీ 2.0 దెబ్బకు Smart Tv ధరలు భారీగా తగ్గాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త టాక్స్ రేట్లతో స్మార్ట్ టీవీ రేట్లు ఎన్నడూ చూడనంత తక్కువ రేటుకు లిస్ట్ అయ్యాయి. ముఖ్యంగా Samsung మరియు LG స్మార్ట్ టీవీ రేట్లు చాలా తక్కువయ్యాయి. 2025 దసరా మరియు దీపావళి పండుగ సేల్ నుంచి స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఈరోజు అమెజాన్ మరియు సేల్ ఫ్లిప్ కార్ట్ సేల్ కూడా స్టార్ట్ అవ్వడం తో స్మార్ట్ టీవీలు మరింత చవక ధరలో లభిస్తున్నాయి.
ముందు ప్రభుత్వం అమలు చేసిన నాలుగు అంచెల టాక్స్ విధానాన్ని సవరిస్తూ ఇప్పుడు కొత్త రెండు అంచెల టాక్స్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంలో అనేక ప్రోడక్ట్ తో పాటు స్మార్ట్ టీవీ మరియు ఏసీల పై కూడా టాక్స్ కూడా తగ్గించింది. గతంలో స్మార్ట్ టీవీ కోసం 28% ఉన్న టాక్స్ స్లాబ్ ను ఇప్పుడు ప్రభుత్వం 18% టాక్స్ స్లాబ్ లోకి తీసుకొచ్చింది. ఈ కారణంగా ఇప్పుడు స్మార్ట్ టీవీల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
ఈ కొత్త టాక్స్ స్లాబ్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు లోకి వచ్చాయి. ఈ కొత్త టాక్స్ స్లాబ్ తో స్మార్ట్ టీవీలు ఎన్నడూ చూడనంత చవక ధరలో అందుబాటులోకి వచ్చాయి. ఇది కాకుండా 2025 దసరా మరియు దీపావళి సందర్భంగా అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన పండుగ సేల్స్ మొదలవడంతో ఈ ధరలు ఇంకా తక్కువ అయ్యాయి. అందుకే కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నవారు ప్రస్తుతం ఉన్న టాక్స్ స్లాబ్ మరియు ఆఫర్స్ తో స్మార్ట్ టీవీ తీసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. అందుకే, ఈరోజు మొదలైన పండుగ సేల్స్ నుంచి లభిస్తున్న రెండు బెస్ట్ స్మార్ట్ టీవీ డీటెయిల్స్ మీకోసం ఇక్కడ ప్రత్యేకంగా అందించాం.
Also Read: Great Indian Festival 2025 మొదటి రోజే Smart TV లపై జబర్దస్త్ ఆఫర్స్ అందించింది.!
సాంసంగ్ యొక్క క్రిస్టల్ 4k సిరీస్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఎప్పుడు చూడనంత చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన 49% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. SBI బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తో కొనేవారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా ల్యాబ్ లభిస్తుంది కాబట్టి, ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 22,490 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ టీవీ 4K LED స్క్రీన్, HDR 10+, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here
ఎల్ జి యొక్క 55 ఇంచ్ ఎఐ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55UA82006LA) కూడా ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 50% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 35,990 ధరతో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ టీవీని సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకున్న వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ మీకు రూ. 34,490 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ టీవీ Alpha7 AI Processor 4K Gen8 టిప్ పని చేస్తుంది. ఇది Dolby Atmos సౌండ్, AI మ్యాజిక్ రిమోట్ మరియు మరిన్ని ఫీచర్స్ తో వస్తుంది.