షియోమీ 5,00,000 కంటే ఎక్కువ టీవీ విక్రయాలను సాధించింది: విడుదల అయినప్పటి నుండి

HIGHLIGHTS

షియోమీ భారతదేశం లో దాని Mi TV లైనప్ ని 6 నెలల క్రితం పరిచయం చేసింది మరియు అప్పటి నుండి సంస్థ భారతదేశం లో 500,000 కంటే ఎక్కువ టీవీ యూనిట్లను విక్రయించింది. ఇందులో మీ టివి 4 55-అంగుళాలు, మీ టివి 4A 32-అంగుళాలు, మరియు మీ టివి 4A 43-అంగుళాల ఉన్నాయి.

షియోమీ 5,00,000 కంటే ఎక్కువ టీవీ విక్రయాలను సాధించింది: విడుదల అయినప్పటి నుండి

భారతదేశంలో హాఫ్ మిలియన్ కంటే ఎక్కువ  MI TV  యూనిట్లను విక్రయించామని అని  షియోమీ ప్రకటించింది. ఈ సంస్థ 6 నెలల క్రితం భారతదేశం లో వారి TV ల యొక్క అమ్మకాని  ప్రారంభించారు. షియోమీ భారతదేశం లో మూడు రక TV లను పరిచయం చేసింది – Mi TV 4 55 అంగుళాల, Mi TV 4A 32-inch, మరియు Mi TV 4A 43 అంగుళాల. 55 అంగుళాల టీవీ లో 4k మరియు HDR 10 ఉన్నాయి.ఇంకా 32 అంగుళాల టీవీ లో ఒక HD రెడీ టీవీ మరియు 43 అంగుళాల TV ఫుల్ హెచ్ డి టీవీ. షియోమీ టీవీ లు ఫ్లిప్కార్ట్, Mi.com, మరియు మి హోమ్ స్టోర్ల లో అందుబాటులో ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

55-అంగుళాల మీ టీవీ 4 మీకు రూ. 44.999 ధరతో వస్తుంది. ఈ టీవీ 4K VA ప్యానెల్ ని  శామ్సంగ్ తయారుచేసింది మరియు ఇది HDR కి మద్దతు ఇస్తుంది. టివికి 64-బిట్ క్వాడ్-కోర్ ఆంలోజిక్ కార్టెక్స్-ఏ 53 SoC, మాలి- T830 GPU మరియు 2జీబీ  ర్యామ్  తో కలిపి ఉంది. ఇది 8జీబీ అంతర్నిర్మిత స్టోరేజిను కలిగి ఉంది మరియు 8W డౌన్ ఫైరింగ్ స్పీకర్లను కలిగివుంది. టివి ఆండ్రాయిడ్ ఆధారిత ప్యాచ్ వాల్ UI తో నడుస్తుంది.

Mi TV 4 గురించి మేము ముందుగానే చెప్పిన విధంగా వెచ్చించే ధర కోసం ఈ టీవీ  ఖచ్చితంగా తగినది ఈ ధర లక్షణాలు పరిగణనలోకి తీసుకుంటే ఇది డబ్బుకి తగిన విలువ ఇస్తుంది. ప్యానెల్ 4K కంటెంట్ మరియు 4K కన్సోల్ గేమింగ్ వినియోగించే వారికోసం ఇది  బాగుంది. అయినప్పటికీ, టీవీ నుండి వచ్చిన ఆడియో మంచిది కావచ్చు కానీ దీని OS లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు మరియు నెట్ఫ్లిక్స్ వంటి ప్రసిద్ధ సేవలు లేకపోవడం వెలితిగా ఉంటుంది.

ఇతర మోడళ్లను గురించి మాట్లాడితే, మి టీవీ 4ఏ  43-inch ధర రూ. 22,999 అయితే మి టీవీ 4ఏ 32-అంగుళాల వేరియేట్ ధర రూ. 13.999 గా ఉంటుంది. రెండు టీవీలు ఆంలోజిక్ క్వాడ్-కోర్ SoC చేత 1జీబీ  ర్యామ్ తో జతచేయబడింది. ఈ రెండు టీవీలు 8జీబీ అంతర్గత నిల్వతో వస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo