Samsung QLED Smart Tv గోట్ సేల్ బిగ్ డీల్ ఈరోజు మిస్సైతే మల్లి దొరకదేమో.!

HIGHLIGHTS

Samsung QLED Smart Tv గోట్ సేల్ బిగ్ డీల్

ప్రీమియం స్మార్ట్ టీవీ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది

ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్స్ ను చూడవచ్చు

Samsung QLED Smart Tv గోట్ సేల్ బిగ్ డీల్ ఈరోజు మిస్సైతే మల్లి దొరకదేమో అనేంత గొప్పగా ఉంది. ఎందుకంటే, ఈ శాంసంగ్ రేసెంట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై బి ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి భారీ డీల్స్ అందించింది. అందుకే, ఈ ప్రీమియం స్మార్ట్ టీవీ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ కలిగిన శాంసంగ్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని కోరుకునే వారు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్స్ ను చూడవచ్చు.

Samsung QLED Smart Tv : ఆఫర్

శాంసంగ్ లేటెస్ట్ క్యూలెడ్ సిరీస్ నుంచి లాంచ్ చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (QA43QEF6AULXL) మోడల్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ 35% భారీ డిస్కౌంట్ తో రూ. 32,999 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీ పై రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది.

ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 28,999 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ ప్రైస్ లో లభించడం ఇదే మొదటిసారి అవుతుంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి కేవలం 6 వేల ధరకే Sony Dolby సౌండ్ బార్ అందుకోండి.!

Samsung QLED Smart Tv : ఫీచర్స్

ఈ శాంసంగ్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ అత్యాధునిక QLED డిస్‌ప్లే టెక్నాలజీతో రూపొందించబడిన ప్రీమియం స్మార్ట్ టీవీ. ఇది 4K UHD (3840 × 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది క్వంటం డాట్ షీట్ టెక్నాలజీతో కూడిన రియల్ క్యూలెడ్ ప్యానెల్ మరియు 100% Color Volume అందిస్తుంది. ఈ ఫీచర్ తో ఇది ప్రకాశవంతమైన మరియు సహజమైన రంగులను ప్రదర్శిస్తుంది. అంతేకాదు, ఇది PANTONE Validated సర్టిఫికేషన్‌ తో ఖచ్చితమైన రంగులను అందిస్తుంది.

ఈ టీవీ Vision AI టెక్నాలజీ తో కంటెంట్‌ ను విశ్లేషించి పిక్చర్ మరియు సౌండ్ ను ఆటోమేటిక్‌ గా ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ టీవీ కలిగిన Crystal Processor 4K ద్వారా వేగవంతమైన పెర్ఫార్మెన్స్, స్మూత్ విజువల్స్ మరియు మెరుగైన వ్యూవింగ్ అనుభవం లభిస్తుంది. ఈ టీవీ Samsung Tizen OS పై పని చేస్తుంది. ప్రముఖ OTT యాప్‌ లతో పాటు 100 కు పైగా ఉచిత టీవీ ఛానెల్స్ అందించే శాంసంగ్ టీవీ ప్లస్ సర్వీస్ కు మద్దతు ఇస్తుంది.

ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ (OTS Lite), అడాప్టివ్ సౌండ్, Q-Symphony మరియు 20W స్పీకర్ అవుట్‌ పుట్ తో స్పష్టమైన మరియు సమతుల్య ఆడియోను ఆస్వాదించవచ్చు. కనెక్టివిటీ కోసం ఈ స్మార్ట్ టీవీ లో Wi-Fi, బ్లూటూత్, HDMI పోర్టులు, USB పోర్టులు, eARC, Ethernet (LAN) వంటి అనేక ఎంపికలు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :