REALME స్మార్ట్ టీవీల మొదటి సేల్

Updated on 01-Jun-2020
HIGHLIGHTS

ఈ టీవీలు రేపు మొదటిసారిగా సేల్ కానున్నాయి.

రియల్మి టీవీ రెండు సైజుల్లో వస్తుంది

ఈ రెండు టీవీలు HDR కి మద్దతు ఇస్తాయి

మీరు కనుక రియల్మి ఇండియాలో  విడుదల చేసిన స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవాలని చూస్తున్నట్లయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్.  ఈ టీవీ యొక్క రెండు వేరియంట్స్ కూడా జూన్ 2 వ తేదికి, అంటే రేపు మొదటిసారిగా సేల్ కానున్నాయి. 32 అంగుళాల రియల్‌మే టీవీ ధర రూ .12,999 కాగా, 43 అంగుళాల టీవీ దీని ధర రూ .21,999 గా ఉంది. ఈ రియల్మి స్మార్ట్ టీవీ Flipkart మరియు realme.com లో   లభిస్తుంది. ఈ టీవీ యొక్క 32-అంగుళాల వేరియంట్ ఒక HD రెడీ టీవీ, అయితే 43-అంగుళాల టీవీ మాత్రం FHD టీవీ. ఈ రెండు టీవీలు HDR కి మద్దతు ఇస్తాయి మరియు Android TV OS తో పనిచేస్తాయి. ఈ టీవీలు గూగుల్ అసిస్టెంట్-ఎనేబుల్డ్ రిమోట్ కంట్రోల్‌తో పాటు OTT ప్లాట్‌ఫారమ్స్ కు మద్దతు ఇస్తుంది.

Realme TV : ఫీచర్లు మరియు ధర

రియల్మి టీవీ రెండు సైజుల్లో  వస్తుంది అవి :  HD-Ready 32-ఇంచ్ మరియు 43-ఇంచ్ FHD మరియు 178-డిగ్రీల వ్యూ ఇంగ్  కోణాన్ని అందిస్తుంది. ఈ టెలివిజన్లలో క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ 16.7 మిలియన్ కలర్స్ సపోర్ట్‌ తీసుకొస్తుంది.

ఈ టెలివిజన్లు 1 జిబి ర్యామ్ మరియు 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో మీడియాటెక్ MSD 6683 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తాయి. ఇవి క్వాడ్-కోర్ ప్రాసెసర్ HDR10 డీకోడింగ్ మరియు HLG ప్రమాణాలకు మద్దతు అందిస్థాయి.

ఈ రియల్మి టీవీలో నాలుగు స్పీకర్లు ఉన్నాయి, ఇవి 24W స్టీరియో సౌండ్‌ను అందిస్తాయి మరియు మెరుగైన సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Audio తో ట్యూన్ చేయబడతాయి. ఈ రెండు టీవీలు 5,000 కి పైగా Apps, గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ మద్దతు కలిగి ఆండ్రాయిడ్ టీవీలను ధృవీకరించాయి. ఈ టీవీలలో Netflix, Amazon Prime వీడియో మరియు మరెన్నో యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేయబడ్డాయి.

ఈ రియల్మి టీవీలు Wi-Fi , బ్లూటూత్ 5.0, మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు SPDD ఇన్పుట్, ఈథర్నెట్ పోర్ట్ మరియు మరెన్నో కనెక్టివిటీలను కలిగి ఉంటుంది .

ఈ టీవీ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో మరియు గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకమైన బటన్లతో ఎర్గోనామిక్ ఫిట్ కోసం నిర్మించిన ప్లాస్టిక్ మరియు కర్వ్ డిజైన్ ఉంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :