Prime Day Sale 2025 big smart tv deals revealed by amazon
Prime Day Sale 2025 బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు అమెజాన్ ఇండియా రివీల్ చేసింది. 2025 సంవత్సరంలో అమెజాన్ అందిస్తున్న ఈ బిగ్ సేల్ నుంచి స్మార్ట్ టీవీ లను గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్స్ తో చాలా తక్కువ రేటుకే అందుకోవచ్చని, అమెజాన్ ఇండియా ఈ అప్ కమింగ్ సేల్ ఆఫర్ల గురించి గొప్పగా చెబుతోంది. అమెజాన్ అప్ కమింగ్ సేల్ బెస్ట్ డీల్స్ వివరాలు ఏమిటో ఒక లుక్కేద్దామా.
ప్రైమ్ డే సేల్ 2025 సేల్ నుంచి ఆఫర్ చేయనున్నట్లు చెబుతున్న కొన్ని ప్రీమియం స్మార్ట్ టీవీ ఆఫర్స్ ఈరోజు అమెజాన్ రివీల్ చేసింది. ఈ ఆఫర్స్ తో అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి చాలా చవక ధరలో Sony, Samsung మరియు LG వంటి ప్రీమియం బ్రాండ్ స్మార్ట్ టీవీ లను సైతం గొప్ప డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 నుంచి శాంసంగ్ 43 ఇంచ్ క్రిస్టల్ 4కె విస్తా ప్రో స్మార్ట్ టీవీని అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 31,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. అంటే, ఈ టీవీ పై దాదాపు 5 వేల వరకు డిస్కౌంట్ అందుకునే అవకాశం ఉంటుంది.
సోనీ బ్రావియా 2 సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని కూడా అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి కేవలం రూ. 50,990 రూపాయల ఆఫర్ ధరకు సొంతం చేసుకోవచ్చని కూడా అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ టీవీ ప్రస్తుతం రూ. 56,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది.
Also Read: Jio Network issue: మీ ప్రాంతంలో జియో నెట్ వర్క్ పని చేయడం లేదా.!
ఈ రెండు ఆఫర్స్ మించి LG పై బిగ్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి LG 55 ఇంచ్ స్మార్ట్ టీవీని అన్ని ఆఫర్లు కలుపుకొని కేవలం 36,490 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 43,990 రూపాయల ధరకు సేల్ అవుతోంది. అయితే, అమెజాన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ రూ. 6000 కంటే ఎక్కువ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తుంది, అని అమెజాన్ చెబుతోంది.