Prime Day 2026 Sony, LG and Samsung upcoming deals teased
2026 కొత్త సంవత్సరంలో అమెజాన్ బిగ్ సేల్ వచ్చేసింది. అదే, అమెజాన్ యొక్క Prime Day 2026 సేల్ మరియు ఈ సేల్ వచ్చే నెల ప్రారంభం నుంచి స్టార్ట్ అవుతుంది. అందరి యూజర్ల కోసం కాకుండా కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే అమెజాన్ ప్రత్యేకంగా అందించే ఈ సేల్ చాలా ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలా ప్రొడక్ట్స్ ను గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉందని అమెజాన్ తెలిపింది. అంతేకాదు, సేల్ నుంచి Sony, LG మరియు Samsung స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకునే అవకాశం ఉందని కూడా టీజర్ పేజీలో డీల్స్ తో టీజింగ్ చేస్తోంది.
అమెజాన్ ప్రకటించిన ప్రైమ్ డే సేల్ జూలై 2 నుంచి జూలై 4 వ తేదీ వరకు నడుస్తుంది. ఈ సేల్ నుంచి అందించనున్న చాలా డీల్స్ మరియు ఆఫర్స్ తో కూడిన టీజర్ పేజి ని అమెజాన్ ఇప్పటికే రివీల్ చేసింది. ఇందులో స్మార్ట్ టీవీ కోసం ప్రత్యేకంగా అందించిన పేజీ నుండి Sony, LG మరియు Samsung స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్ అందుకోండి, అని టీజింగ్ చేసింది.
ఈ అప్ కమింగ్ సేల్ నుంచి సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేసింది. సోనీ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై మంచి డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సోని స్మార్ట్ టీవీ మంచి ఆఫర్ దగరలో లభిస్తుందని అమెజాన్ తెలిపింది.
అలాగే, ఎల్ జి రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ Nano 4K UHD స్మార్ట్ టీవీ పై అమెజాన్ డీల్స్ అనౌన్స్ చేసింది. రూ. 85,990 రూపాయల ప్రైస్ తో వచ్చిన ఈ స్మార్ట్ టీవీని ప్రైమ్ డే సేల్ నుంచి గొప్ప ఆఫర్ లో అందుకోవచ్చని అమెజాన్ టీజర్ లో తెలిపింది.
Samsung సరికొత్తగా విడుదల చేసిన 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీని అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి గొప్ప ఆఫర్ ధరలో పొందొచ్చని అమెజాన్ తెలిపింది. ఈ ఫోన్ భారీ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు అమెజాన్ టీజర్ పేజి లో టీజింగ్ చేసింది.
Also Read: Samsung Galaxy M47 5G: స్టన్నింగ్ డిజైన్ మరియు బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
కేవలం ఇక్కడ తెలిపిన మూడు స్మార్ట్ టీవీలు మాత్రమే కాదు షియోమీ, TCL, ఫిలిప్స్ మరియు Vu వంటి మరిన్ని కంపెనీల స్మార్ట్ టీవీలు కూడా అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తాయని అమెజాన్ టీజింగ్ చేసింది.