Oneplus TV Y1S: వన్ ప్లస్ నుండి వస్తున్న మరొక స్మార్ట్ టీవీ

HIGHLIGHTS

వన్ ప్లస్ మరొక స్మార్ట్ టీవీని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది

వన్ ప్లస్ అప్ కమింగ్ టీవీ Oneplus TV Y1S

6 ప్రత్యేకతతో ఈ స్మార్ట్ టీవీ తీసుకువస్తునట్టు టీజింగ్

Oneplus TV Y1S: వన్ ప్లస్ నుండి వస్తున్న మరొక స్మార్ట్ టీవీ

వన్ ప్లస్ కంపెనీ ఇండియాలో మరొక స్మార్ట్ టీవీని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. Oneplus TV Y1S స్మార్ట్ టీవీ లాంచ్ గురించి ప్రకటించింది మరియు ఈ స్మార్ట్ టీవీ కోసం టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది. TV Y1S స్మార్ట్ టీవీ ను 6 ఆకర్షణీయమైన ప్రత్యేకతతో తీసుకువస్తునట్టు ఈ టీజర్ నుండి అర్ధమవుతోంది. వన్ ప్లస్ ఈ TV Y1S స్మార్ట్ టీవీని ఫిబ్రవరి 17న ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S  గురించి టీజ్ చేస్తున్న 6 ప్రత్యేకతల వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ టీవీ అతి సన్నని అంచులను కలిగి ఉన్నట్లు చెబుతోంది మరియు టీజర్ పేజ్ ద్వారా ఈ విషయం మనకు కూడా అర్ధమవుతోంది. ఈ టీవిలో పవర్ ఫుల్ గామా ఇంజన్ అందించినట్లు, దీనిద్వారా స్పష్టమైన వివరాలను క్లియర్ గా చూడవచ్చని చెబుతోంది.

OnePlus TV Y1S India Launch.jpg

ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుందని కంపెనీ కూడా టీజర్ ద్వారా వెల్లడించింది. దీనితో పాటుగా ALLM (ఆటో లో లేటెన్సీ మోడ్) ని కూడా ఈ టీవిలో అందించింది. అంటే, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ )OS తో పాటుగా ల్యాగ్ ఫ్రీ మరియు మృధువైన అనుభావాన్ని అందిస్తుందని చెబుతోంది.

ఈ OnePlus స్మార్ట్ టీవీ, వన్ ప్లస్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు బ్లూటూత్ డివైజ్ లకు ఎటువంటి అంతరాయం లేని సీమ్ లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవి పనిచేయనున్న Processor గురించి మాత్రం ఫిబ్రవరి 14 న రివీల్  చేయనున్నట్లు తెలిపింది.                            

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo