OnePlus TV: Y1S Pro సిరీస్ నుండి వస్తున్న మరొక స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

కొత్త 50 ఇంచ్ స్మార్ట్ టీవీ గురుంచి ప్రకటించిన వన్ ప్లస్

ఈ స్మార్ట్ టీవీ దాదాపుగా దీనికి ముందుగా వచ్చిన 43 Y1S Pro మాదిరిగా కనిపిస్తోంది

మరిన్ని కొత్త ఫీచర్లను జత చేసినట్లు కూడా కనిపిస్తోంది

OnePlus TV: Y1S Pro సిరీస్ నుండి వస్తున్న మరొక స్మార్ట్ టీవీ.!

ఇటీవల ఇండియాలో Y1S Pro సిరీస్ నుండి 43 ఇంచ్ స్మార్ట్ టీవీని తీసుకొచ్చిన వన్ ప్లస్, ఇప్పుడు ఇదే సిరీస్ నుండి మరొక స్మార్ట్ టీవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణంలో తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. అంటే, దీనర్ధం ఈ స్మార్ట్ టీవీ విడుదలైన తరువాత అమెజాన్ ద్వారా సేల్ కావచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుతానికి ఈ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ఎప్పుడు అనేవిషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ టీవీ యొక్క కీలకమైన వివరాలను మాత్రం వెల్లడించింది. ఈ వెల్లడించిన ఫీచర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీ దాదాపుగా దీనికి ముందుగా వచ్చిన 43 Y1S Pro మాదిరిగా కనిపిస్తోంది. అయితే, మరిన్ని కొత్త ఫీచర్లను జత చేసినట్లు కూడా కనిపిస్తోంది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ HDR 10 Decoding మరియు అతిసన్నని అంచులు (బెజెల్ లెస్) డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ AI-Powered విజువల్స్ ను అందిస్తుంది. అంటే, MEMC, డైనమిక్ కాంట్రాస్ట్, కంటెంట్ ఆప్టిమైజేషన్ వంటి వాటి సహాయంతో గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, అని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ ని మరింత పెంచడానికి స్మార్ట్ మేనేజ్మెంట్ అప్షన్ ను కూడా జతచేసినట్లు చెబుతోంది.   OnePlus TV Y1S Pro 43 speakers.jpg

ఈ OnePlus స్మార్ట్ టీవీ, వన్ ప్లస్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు బ్లూటూత్ డివైజ్ లకు ఎటువంటి అంతరాయం లేని సీమ్ లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగిన 24W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుందని వన్ ప్లస్ టీజర్ ద్వారా వేల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo