MOTOROLA యొక్క 75 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ ఇండియాలో విడుదలకానుంది

MOTOROLA యొక్క 75 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ ఇండియాలో విడుదలకానుంది
HIGHLIGHTS

ఈ టీవీ వివిధ ఆటల కోసం వైర్‌లెస్ గేమ్‌ప్యాడ్‌తో వస్తుంది.

మోటరోలా తన కొత్త స్మార్ట్ టీవీలతో, టెలివిజన్ విభాగంలోకి దూసుకెళ్లింది. ఈ టీవీలు 32 నుండి 65-అంగుళాల వరకు ఉంటాయి మరియు ప్రారంభ ధర రూ .13,999 తో వస్తాయి. ఇప్పుడు, మోటరోలా కొత్త 75-అంగుళాల 4 K స్మార్ట్ LED, ఎట్టకేలకు ఇండియాను చేరుకోనుంది. ఈ టీవీ వివిధ ఆటల కోసం వైర్‌లెస్ గేమ్‌ప్యాడ్‌తో వస్తుంది. ఫ్లిప్‌ కార్ట్‌లో ఈ 75 అంగుళాల మోటరోలా టీవీని, దాని ధరను మరియు ముఖ్యమైన ఫీచర్లతో పాటు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ జాబితా ప్రకారం, మోటరోలా యొక్క తాజా టీవీ (75SAUHDM) 75-అంగుళాల 4K IPS ప్యానెల్‌ను కలిగి ఉంది. దీని డిస్ప్లే 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు Dolby విజన్ + HDR 10, 450 నిట్స్ బ్రైట్నెస్ , 178-డిగ్రీల వ్యూవింగ్ యాంగిల్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 1GHz CA53 క్వాడ్-కోర్ CPU, మాలి 450 క్వాడ్-కోర్ GPU ద్వారా పనిచేస్తుంది. 2.25GB RAM తో జత చేయబడింది. ఇంకా, ఇది 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఇక ఆడియో విషయానికొస్తే, ఈ టీవీలో డ్యూయల్ బాటమ్-ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి, మొత్తం అవుట్పుట్ 30W అందిస్తుంది. అంతేకాకుండా, ఇది DOLBY Audio , DTS ట్రూ సరౌండ్‌కు మద్దతు ఇస్తుంది మరియు స్టాండర్డ్, మ్యూజిక్, స్పోర్ట్ మరియు మూవీ వంటి సౌండ్ మోడ్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలకు వస్తే, ఈ టీవీలో 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, 1RF  కనెక్టివిటీ ఇన్‌పుట్, 1 డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ ఉన్నాయి మరియు డేడికేటెడ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ టివి గేమ్‌ప్యాడ్ కూడా ఉంది.

మోటరోలా 75-అంగుళాల 4 కె స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఆండ్రాయిడ్ 9 (పై) నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, హాట్‌స్టార్ మరియు గూగుల్ సూట్ ఆఫ్ యాప్‌లతో సహా పలు రకాల యాప్స్ కి ఇది మద్దతు ఇస్తుంది. మరిన్ని యాప్స్  ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా, స్మార్ట్ రిమోట్ కంట్రోల్ నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ప్లే, యూట్యూబ్ మరియు గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకమైన కీలను కలిగి ఉంది. ఇది అంతర్నిర్మిత Chromecast లక్షణంతో కూడా వస్తుంది.

మోటరోలా 75 అంగుళాల 4 K స్మార్ట్ ఆండ్రాయిడ్ టివిని సొంతం చేసుకోవాలంటే,  వినియోగదారులు రూ .1,19,999 ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. అక్టోబర్ 25 నుండి ఈ టీవీ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo