never before discount offers on 43 inch 4K Dolby Vision smart tv
బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Dolby Vision స్మార్ట్ టీవీ పై నెవర్ బిఫోర్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది ఫ్లిప్ కార్ట్. అతి చవక ధరలో స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నట్లయితే ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ను పరిశీలించవచ్చు. ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం 16 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
TCL ఉప బ్రాండ్ ఐఫాల్కన్ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ (43U65) ఈరోజు 16 వేల రూపాయలు ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 64% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 17,999 రూపాయల అతి తక్కువ రేటుకే సేల్ చేస్తోంది.
అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 16,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం ఉంది.
Also Read: boAt Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ HVA LED ప్యానల్ కలిగి ఉంటుంది మరియు ఇది 60Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు MEMC ఫీచర్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ అంతర్గత మెమరీ కలిగి ఉంటుంది.
ఈ టీవీ సౌండ్ పరంగా కూడా బాగానే ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో పాటు DTS X సౌండ్ సౌండ్ సపోర్ట్ కూడా ఉంటుంది మరియు ఈ టీవీ టోటల్ 24W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ టీవీ HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, Av ఇన్ వంటి అన్ని కనెక్టవిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.