latest 55 inch QLED Smart Tv available at lowest price ever
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన 55 ఇంచ్ QLED Smart Tv కోసం సెర్చ్ చేస్తుంటే ఈరోజు మీకోసం గొప్ప డీల్ అందుబాటులో ఉంది. తక్కువ అంచులు కలిగి మంచి డిజైన్ తో ఉండటమే కాకుండా డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు కేవలం 26 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అందుకోవచ్చు.
ఈరోజు ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ఫ్లిప్ కార్ట్ అందించింది.అదేమిటంటే, Infinix ఇటీవల లాంచ్ చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55GU1Q/55GU3Q) ని రూ. 9,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని SBI, BOB Card మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 26,499 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ క్యూలెడ్ టీవీ డాల్బీ విజయం మరియు HDR 10 సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు మంచి ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 2 HDMI, 2 USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Lava Agni 4 లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసింది.!
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.