get 55 inch smart tv at 43 inch smart tv price and here is the details
కొత్త స్మార్ట్ టీవీ కొనడానికి ఉవ్విళ్ళూరుతున్న వారి కోసం ఈరోజు గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీ ధరలు రోజు రోజుకు క్రిందకు దిగుతున్న వైనం చూస్తూనే ఉన్నాము. అయితే, ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ గురించి నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అంత చావెజ్ ధరకు లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు లభిస్తున్న డీల్ ప్రైస్ ను పోలిస్తే కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ Smart Tv లభిస్తుందని తడుముకోకుండా చెప్పవచ్చు.
iFFALCON by TCL ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 2025 మోడల్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ U65 ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ కు లభిస్తుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 63% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 26,999 డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ చేస్తోంది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై డెబిట్ / క్రెడిట్ మరియు UPI తో చేసే చెల్లింపు పై అదనపు డిస్కౌంట్ కూడా ప్రకటించింది.
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ మరియు UPI ఎంపికతో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,999 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. అయితే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కేవలం జూన్ 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Also Read: HP OmniBook 5: 34 గంటల బ్యాటరీ లైఫ్ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో లాంచ్ అవుతోంది.!
ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ AiPQ ప్రొసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈటీవీ చాలా స్లీక్ డిజైన్ తో ఆకర్షనీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ కలిగిన సౌండ్ టెక్నాలజీ మరియు సౌండ్ అవుట్ విషయానికి వస్తే, ఇందులో రెండు ఇంటిగ్రేటెడ్ బాక్స్ స్పీకర్లు కలిగి టోటల్ 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో Wi-Fi 5, మల్టీ ఐ కేర్, మైక్రో డిమ్మింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, AV ఇన్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.