Flipkart Sale నుంచి 23 వేలకే 55 ఇంచ్ 4K Dolby Vision స్మార్ట్ టీవీ అందుకోండి.!
23 వేలకే 55 ఇంచ్ 4K Dolby Vision స్మార్ట్ టీవీ అందుకునే గొప్ప అవకాశం
Flipkart Sale నుంచి ఈ గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది
కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు
Flipkart Sale నుంచి 23 వేలకే 55 ఇంచ్ 4K Dolby Vision స్మార్ట్ టీవీ అందుకునే గొప్ప అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ప్రతి నెల ప్రారంభంలో అందించే ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు. బడ్జెట్ ధరలో పెద్ద స్క్రీన్ కలిగిన స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్న యూజర్లు ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పరిశీలించవచ్చు.
SurveyFlipkart Sale 4K Dolby Vision టీవీ డీల్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ మొదటి రోజు ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. అదేమిటంటే, ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ CooCaa గత సంవత్సరం విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55Y73) పై ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు సేల్ నుంచి 64% బిగ్ డిస్కౌంట్ తో రూ. 24,999 రూపాయల రేటుతో సేల్ చేస్తోంది.
ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత తక్కువ ధరకు అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC మరియు BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,499 రూపాయల చవక ధరకి లభిస్తుంది.
Also Read: MOTOROLA Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ BBD సేల్ బిగ్ డీల్ అందుకోండి.!
CooCaa 4K Dolby Vision Smart Tv : ఫీచర్స్
కూకా యొక్క స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ ప్రొఫెషనల్ కరోకే మోడ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ కూకా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 30W పవర్ ఫుల్ సౌండ్ కూడా అందిస్తుంది. ఈ బిగ్ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్, బిల్ట్ ఇన్ Wi-Fi మరోయు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.