Flipkart Sale last day offers best deals on 50 inch QLED Smart Tv
Flipkart Sale ఈరోజు రాత్రి తో ముగుస్తుంది. అందుకే, ఈ చివరి రోజున గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందించింది. ప్రతి నెల ఫ్లిప్ కార్ట్ అందించే బిగ్ బాచాత్ సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. ఈ సేల్ నుంచే ఈ జబర్దస్త్ బిల్ ని యూజర్ల కోసం అందించింది. ఈ సేల్ నుంచి 50 ఇంచ్ QLED Smart Tv ను చాలా తక్కువ ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.
ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బాచాత్ సేల్ నుంచి Thomson లేటెస్ట్ 50 నుంచి క్యూలెడ్ స్మార్ట్ టీవీ (50TJQ0022) పై ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 38% డిస్కౌంట్ తో కేవలం రూ. 22,499 రూపాయల ఆఫర్ ధరలో అందించింది. అంతేకాదు, ఈ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందుకునే అవకాశం కూడా అందించింది.
అదెలాగంటే, ఈ టీవీని ఈరోజు సేల్ నుంచి BOB CARD EMI లేదా HDFC క్రెడిట్ కార్డు తో తీసుకునే యూజర్లకు ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: Realme 16 Pro Plus: ప్రీమియం కెమెరా సెటప్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది.!
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు UHD 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు HLG సపోర్ట్ కలిగి మంచి విజువల్స్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ జియో యొక్క లేటెస్ట్ JioTele OS పై నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ అన్ని ఇండియన్ లాంగ్వేజ్ లకు సపోర్ట్ కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈ టీవీలో రెండు బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉంటాయి. ఈ టీవీ టోటల్ 48W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవిలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఈథర్ నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.