flipkart sale last day best Samsung 4K Smart Tv deal
దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. అందుకే కాబోలు చివరి సమయంలో Samsung 4K Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. మార్కెట్లో ఇటీవల శాంసంగ్ విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ అందించింది ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ బిగ్ డీల్ తో శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ కేవలం 24 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.
శాంసంగ్ రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ Crystal 4K Vista పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే నుంచి ఈ స్మార్ట్ టీవీ పై 34% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 25,990 ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తీసుకున్న వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. వాస్తవానికి, ప్రభుత్వం ప్రకటించిన GST కూడా ఈ టీవీ రేటు తగ్గడానికి కారణం అయ్యింది.
Also Read: మరికొన్ని గంటల్లో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే iPhone 16 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ LED ప్యానల్ ని 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+, PurColor మరియు మోషన్ ఎక్సిలరేటర్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Crystal Processor 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4K అప్ స్కేలింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ స్లిమ్ లుక్ డిజైన్ మరియు బౌండ్ లెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ ఫీచర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ Q-Symphony మరియు అడాప్టివ్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు యూట్యూబ్ క్విక్ యాక్సెస్ కోసం హాట్ కీ కలిగిన ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో కూడా వస్తుంది.