Flipkart Sale: LED రేటుకే లభిస్తున్న బ్రాండెడ్ బిగ్ Mini LED స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

Flipkart Sale ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది

ఈ సేల్ నుంచి ఈరోజు జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ ను ప్రకటించింది

LED రేటుకే లభిస్తున్న బ్రాండెడ్ బిగ్ Mini LED టీవీని ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది

Flipkart Sale: LED రేటుకే లభిస్తున్న బ్రాండెడ్ బిగ్ Mini LED స్మార్ట్ టీవీ.!

Flipkart Sale ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. అదేనండి, ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుంచి ఈరోజు జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ ను ప్రకటించింది. భారీ డిస్కౌంట్ తో LED రేటుకే లభిస్తున్న బ్రాండెడ్ బిగ్ Mini LED స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ మరియు సౌండ్ అందించే సత్తాని కలిగి ఉంటుంది మరియు ఈరోజు బడ్జెట్ ధరలోనే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Sale: స్మార్ట్ టీవీ ఆఫర్

ఫ్లిప్ కార్ట్ ది బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు ఈ గొప్ప మినీ LED స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. అదేమిటంటే, మోటోరోలా లేటెస్ట్ గా విడుదల చేసిన EnvisionX Spectra (55 ఇంచ్) మినీ LED మోడల్ నెంబర్ 55UHDGMMWKRQ ఈరోజు 42% భారీ డిస్కౌంట్ తో రూ. 39,999 రూపాయల ఆఫర్ అందించింది.

ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ మోటోరోలా మినీ LED స్మార్ట్ టీవీని కేవలం రూ. 38,499 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. ఈ టీవీ ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే ప్రధమం.

Also Read: Amazon GIF Sale మొదటి రోజే భారీ QLED Smart Tv డీల్ ప్రకటించిన అమెజాన్.!

MOTOROLA (54 inch) Mini LED : ఫీచర్స్

మోటోరోలా యొక్క ఈ మినీ LED స్మార్ట్ టీవీ రెగ్యులర్ QLED స్మార్ట్ టీవీల కంటే అధిక కాంట్రాస్ట్ మరియు బ్రైట్నెస్ తో పాటు 100% కలర్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

Flipkart Sale Mini LED Smart Tv

ఈ టీవీ 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫుల్ ఆరే లోకల్ డిమ్మింగ్ మరియు Dolby Vision సపోర్ట్ తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ MEMC మరియు ALLM ఫీచర్ ను కూడా కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ మినీ LED స్మార్ట్ టీవీ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 40 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo