జబర్దస్త్ ఆఫర్: 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Smart TV అందుకోండి.!

HIGHLIGHTS

పెద్ద స్క్రీన్ Smart TV ని బడ్జెట్ ధరలో అందుకునే గొప్ప అవకాశం

50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Smart TV అందుకోవచ్చు

ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్

పెద్ద స్క్రీన్ Smart TV ని బడ్జెట్ ధరలో అందుకునే గొప్ప అవకాశం Flipkart అందించింది. సింపుల్ గా అర్ధమయ్యేలా చెప్పాలంటే, 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Smart TV అందుకోవచ్చు. బడ్జెట్ ధరలో ధరలో బిగ్ స్మార్ట్ టీవీ కోసం మీరు కూడా చూస్తున్నట్లయితే ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ పైన ఒక లుక్కేయండి.

Smart TV Offer

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ మోటరోలా గత సంవత్సరం తీసుకొచ్చిన 65 ఇంచ్ బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీ MOTOROLA EnvisionX (65) ఈరోజు Flipkart నుంచి 39% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 38,999 ఆఫర్ ధరకే అందిస్తోంది.

HDFC Bank Credit Card ఈ స్మార్ట్ టీవీ కొనేవారికి రూ. 1,250 అదనపు తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు, ఆప్షన్ తో కొనేవారికి కూడా 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: YouTube నుండి 22 లక్షల ఇండియన్స్ వీడియోలు డిలీట్.. ఎందుకంటే.!

MOTOROLA EnvisionX (65): ప్రత్యేకతలు

ఈ మోటరోలా స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ 3840 x 2160 పిక్సెల్స్ (4K) రిజర్వేషన్ మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ మంచి మంచి విజువల్స్ ను అందిస్తుంది మరియు మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది.

Motorola 65 inch smart tv Features

ఈ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది. సౌండ్ పరంగా, ఈ టీవీ Dolby Digital, Dolby Digital Plus టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లను కలిగి వుంది. ఈ టీవీలో కనెక్టివిటీ పరంగా Dual Band Wi-Fi, HDMI, USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

ఈ స్మార్ట్ టీవీ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, తక్కువ ధరలో పెద్ద 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ను చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :