ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లాస్ట్ డే TCL Mini LED స్మార్ట్ టీవీ పై అతి భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లాస్ట్ డే TCL Mini LED స్మార్ట్ టీవీ పై అతి భారీ డిస్కౌంట్ ప్రకటించింది

ఈ సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది

చివరి రోజు ఈ భారీ స్మార్ట్ టీవీ డీల్స్ అందించినట్లు తెలుస్తోంది

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లాస్ట్ డే TCL Mini LED స్మార్ట్ టీవీ పై అతి భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. అందుకే చివరి రోజు ఈ భారీ స్మార్ట్ టీవీ డీల్స్ అందించినట్లు తెలుస్తోంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ టిసిఎల్ లేటెస్ట్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఈ సేల్ చివరి రోజు మంచి డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తుంది.

TCL Mini LED స్మార్ట్ టీవీ : ఆఫర్

టిసిఎల్ లేటెస్ట్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి 55A400M మోడల్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై ఈ రోజు 41% భారీ డిస్కౌంట్ అందించి రూ. 64,999 ఆఫర్ ధరలో ఈ టీవీ సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఎలా పేమెంట్ చేస్తే ఎంత డిస్కౌంట్ వస్తుంది ఆఫర్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

  • Paytm తో ఈ టీవీ కొనే వారికి : రూ. 10,050
  • ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు ఆఫర్ : రూ. 12,750
  • ఫ్లిప్ కార్ట్ Axis క్రెడిట్ కార్డు ఆఫర్ : రూ. 13,225
  • బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ఆఫర్ : రూ. 12,250

వీటిలో ఏ ఒక ఆఫర్ అందుకున్న ఈ స్మార్ట్ టీవీని కేవలం 54 వేల రూపాయలు లేదా ‘అంత కంటే తక్కువ ధరలో అందుకోవచ్చు.

Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే అందుకోండి.!

TCL Mini LED స్మార్ట్ టీవీ : ఫీచర్స్

టిసిఎల్ యొక్క ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అత్యాధునిక మినీ LED మరియు QLED డిస్‌ప్లే టెక్నాలజీలతో రూపొందించబడిన ప్రీమియం స్మార్ట్ టీవీ. ఇది 4K UHD (3840 × 2160) రిజల్యూషన్, 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 488 ప్రిసైజ్ డిమ్మింగ్ జోన్స్ HDR హై బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ టీవీ HVA (హై కాంట్రాస్ట్ ప్యానల్) కలయికతో అద్భుతమైన స్పష్టత, లోతైన నలుపు రంగులు, ప్రకాశవంతమైన హైలైట్స్ మరియు సహజమైన రంగులు అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ TSR AiPQ Processor AI సాంకేతికతతో ప్రతి సన్నివేశాన్ని విశ్లేషించి కాంట్రాస్ట్, కలర్, క్లారిటీ, మోషన్‌ ను ఆటోమేటిగ్గా మెరుగుపరుస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR10, HDR10+, HLG, AI పిక్చర్ ఆప్టిమైజేషన్, MEMC, Micro-OD, హాలో కంట్రోల్, AI క్లారిటీ మాస్టర్, AI కాంట్రాస్ట్ మాస్టర్ మరియు Eye Comfort Mode వంటి ప్రీమియం ఫీచర్లు కలిగి కంటెంట్‌ ను మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది.

ఈ టిసిఎల్ స్మార్ట్ టీవీ ONKYO Hi-Fi సౌండ్ సిస్టమ్‌ సెటప్ తో వస్తుంది. ఇది డాల్బీ అట్మోస్, DTS Virtual, AI సౌండ్ ఆప్టిమైజేషన్, క్లియర్ వాయిస్ ఎన్హన్సమెంట్ వంటి టెక్నాలజీ సపోర్ట్ తో థియేటర్ స్థాయి ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఈథర్నెట్, ఆప్టికల్ ఆడియో, eARC వంటి కనెక్టివిటీ ఎంపికలు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :