దీపావళి సేల్ ముగిసినా ఆగని ఆఫర్లు ఫ్లిప్ కార్ట్ నుండి శామ్సంగ్ బిగ్ టీవీ పైన బిగ్ డీల్స్.!

HIGHLIGHTS

దీపావళి కోసం ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ దివాళీ సేల్ ముగిసిన ఆఫర్ల వెల్లువ మాత్రం ఆగనంటోంది

ఫ్లిప్ కార్ట్ అప్లయన్సెస్ బొనాంజా సేల్ ను ప్రకటించింది

ఈ సేల్ నుండి శామ్సంగ్ బిగ్ టీవీ పైన బిగ్ డీల్స్ అందించింది

దీపావళి సేల్ ముగిసినా ఆగని ఆఫర్లు ఫ్లిప్ కార్ట్ నుండి శామ్సంగ్ బిగ్ టీవీ పైన బిగ్ డీల్స్.!

దీపావళి కోసం ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ దివాళీ సేల్ ముగిసిన ఆఫర్ల వెల్లువ మాత్రం ఆగనంటోంది. ఎందుకంటే, బిగ్ దివాళీ సేల్ ముగిసిన తరువాత ఫ్లిప్ కార్ట్  వెంటనే అప్లయన్సెస్ బొనాంజా సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ నుండి  శామ్సంగ్ బిగ్ టీవీ పైన బిగ్ డీల్స్ అందించింది. మంచి కలర్ ఆక్యురసీ మరియు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ను అందించగల స్మార్ట్ టీవీలుగా పేరుపొందిన Samsung (43inches) Crystal 4K Series స్మార్ట్ టీవీ పైన ఈ డీల్స్ అందించింది. మరి ఈ స్మార్ట్ టీవీ అఫర్ పైన ఒక లుక్ వేద్దామా .            

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung (43inches) Crystal 4K Series: ధర మరియు ఆఫర్లు

Samsung 43 ఇంచ్ Crystal 4K Series 4K UHD స్మార్ట్ టీవీ సేల్ ముందు వరకు రూ.34,999 ధరతో లభించేది. అయితే, ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ నుండి 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.30,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung (43inches) Crystal 4K Series: ఫీచర్లు

ఇక ఈ శామ్సంగ్ 4K స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇది 43 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఎయిర్ స్లిమ్ డిజైన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ మరియు UHD డిమ్మింగ్ సపోర్ట్ ను కలిగివుంది. ఈ శామ్సంగ్ 4K స్మార్ట్ టీవీ Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీతో 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది.

ఈ 4K స్మార్ట్ టీవీ శామ్ సంగ్ సొంత Tizen OS పైన పనిచేస్తుంది. ఈ టీవీ Crystal Processor 4K తో మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీలో 3HMDI (1HDMI eArc)  మరియు 1 USB పోర్టులను కలిగివుంది. ఈ టీవీ 1.5 GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్, ట్యాప్ వ్యూ, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు Samsung Plus తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo