flipkart big deal on 50 inch big qled smart tv
Smart Tv: బడ్జెట్ ధరలో బిగ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఈరోజు బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందుబాటులో ఉంది. ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 23 వేల రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.
ప్రముఖ స్మార్ట్ టీవీ తయారీ కంపెనీ థాంసన్ ఇండియన్ మార్కెట్ లో ఇటీవల విడుదల చేసిన 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (Q50H1000) ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలుపుకొని 23 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఇక ఈ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ వివరాల్లోకి వెళితే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 62% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.
కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ టీవీని HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 భారీ అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,999 ధరకే లభిస్తుంది.
Also Read: Noise Buds X Ultra: బడ్జెట్ Hybrid ANC ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన నోయిస్.!
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 50 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. స్మార్ట్ టీవీ క్వాడ్ చిప్ సెట్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ థాంసన్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Atmos సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 40W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ టీవీ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని ఫ్లిప్ కార్ట్ యూజర్లు చెబుతున్నారు మరియు ఈ స్మార్ట్ టీవీ కి 4 స్టార్ రేటింగ్ కూడా అందించారు.