Smart Tv Deals: మంచి డిస్కౌంట్ తో 8 వేల ధరలో లభిస్తున్న పెద్ద టీవీలు.!

HIGHLIGHTS

10 వేల బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనడానికి బెస్ట్ ఆప్షన్

ఈ రోజు Flipkart Big Bachat సేల్ నుండి మంచి డీల్స్ ఉన్నాయి

మంచి డిస్కౌంట్ తో 8 వేల ధరలో లభిస్తున్న పెద్ద టీవీలు

Smart Tv Deals: 10 వేల బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనడానికి ఆప్షన్ ల కోసం వెతుకుతున్నారా? అయితే, ఈ రోజు Flipkart Big Bachat సేల్ నుండి మంచి డీల్స్ ఉన్నాయి. రేపటితో ముగియనున్న ఈ సేల్ నుండి ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. వాటిలో మంచి డిస్కౌంట్ తో 8 వేల ధరలో లభిస్తున్న పెద్ద టీవీలు ఈరోజు చూద్దాం.

Smart Tv Deals

best Smart Tv Deals

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుండి ఈరోజు చాలా 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. ఇందులో బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం. ఈ డీల్స్ లో Coocaa, Kodak మరియు Thomson బ్రాండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ లు ఉన్నాయి.

Coocaa (32) HD Ready Smart Tv

ఆఫర్ ధర : రూ. 7,999

కూకా బ్రాండ్ యొక్క ఈ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 78% డిస్కౌంట్ తో రూ. 7,999 ధరలో లభిస్తోంది. ఈ టీవీ ని BOBCARD తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ Dolby Digital సౌండ్ మరియు 400 నిట్స్ బ్రైట్నెస్ స్క్రీన్ తో వస్తుంది. ఇందులో HDMI, USB మరియు Wi-Fi సపోర్ట్ కూడా ఉన్నాయి.

Kodak (32) HD Ready Smart Tv

ఆఫర్ ధర : రూ. 8,499

కోడాక్ బ్రాండ్ నుంచి వచ్చిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 43% డిస్కౌంట్ తో రూ. 8,499 రేటుకే ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన కూడా BOBCARD తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ టీవీ 30W స్పీకర్లు, బెజెల్ లెస్ డిజైన్, 400 నిట్స్ స్క్రీన్ మరియు HDMI, USB మరియు Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది.

Also Read: iQOO Z9X 5G: చవక ధరలో 6000 mAh బ్యాటరీ మరియు SD 6 Gen 1 చిప్సెట్ తో వచ్చింది.!

Thomson Alpha (32) HD Ready Smart Tv

ఆఫర్ ధర : రూ. 8,499

థాంసన్ అందించిన ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కూడా ఈరోజు 43% డిస్కౌంట్ తో రూ. 8,499 రేటుకే అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీ కూడా BOBCARD 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఈ టీవీ 30W స్పీకర్లు, ఫ్రెమ్ లెస్ స్క్రీన్, 400 నిట్స్ స్క్రీన్ మరియు HDMI, USB మరియు Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :