Flipkart Back to campus sale best 55 inch QLED Smart Tv deal
Flipkart Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ రీసెంట్ సేల్ బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి ఈరోజు బెస్ట్ డీల్స్ అందించింది. ఈ బ్యాక్ టు క్యాంపస్ సేల్ ఈరోజు రాత్రితో ముగుస్తుంది. అందుకే కాబోలు చివరి రోజు ఒక గొప్ప 55 ఇంచ్ QLED Smart Tv డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ తో ఆల్ రౌండ్ ఫీచర్స్ కలిగిన బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం 27 వేల రూపాయల బడ్జెట్ ధారలలోనే లబిస్తుంది.
realme TechLife ఇటీవల ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (55UHDGQRVSAQ) పై ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 59% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 28,999 డిస్కౌంట్ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ టీవీ మరింత తక్కువ ధరకు పొందాలనుకుంటే ఈ టీవీ అందించిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందుకోవాలి. SBI మరియు HDFC క్రెడిట్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ ఈ టీవీ పై అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 27,499 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.
Also Read: Nothing Phone 3: 60x జూమ్ సపోర్ట్ కలిగిన 50MP పెరిస్కోప్ కెమెరాతో వస్తుంది.!
ఈ రియల్ మీ టెక్ లైఫ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ MediaTek క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ RAM తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు MEMC సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.
సౌండ్ పరంగా, ఈ రియల్ మీ టెక్ లైఫ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 40W టోటల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ప్రీమియం మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ గూగుల్ టీవీ 5.0 OS తో పని చేస్తుంది. ఇందులో HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, AV ఇన్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.