నోకియా పెద్ద స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ అఫర్..ఫ్లిప్ కార్ట్ అప్లయన్సెస్ బొనాంజా సేల్ నుండి అందుకోండి.!

HIGHLIGHTS

నోకియా స్మార్ట్ టీవీ అదీకూడా పెద్ద 4K UHD టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్

Flipkart ప్రకటించిన Appliances Bonanza సేల్ నుండి గొప్ప టీవీ ఆఫర్లను అందించింది

ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి Nokia పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది

నోకియా పెద్ద స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ అఫర్..ఫ్లిప్ కార్ట్ అప్లయన్సెస్ బొనాంజా సేల్ నుండి అందుకోండి.!

నోకియా స్మార్ట్ టీవీ అదీకూడా పెద్ద 4K UHD టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. బిగ్ దివాళీ సేల్ ముగిసిన తరువాత Flipkart ప్రకటించిన Appliances Bonanza సేల్ నుండి గొప్ప టీవీ ఆఫర్లను అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి Nokia పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తో నోకియా స్మార్ట్ టీవీ ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది. ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ యొక్క సంగతులు ఏమిటో చూసేద్దామా.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nokia (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ: ధర మరియు అఫర్

నోకియా యొక్కఈ  43 అంగుళాల స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ.23,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి SBI క్రెడిట్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, మరింత తక్కువ ధరకే ఈ నోకియా స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.     

Nokia (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ: ప్రత్యేకతలు

Nokia (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ యొక్క డిస్ప్లే 3840 × 2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌ కలిగి ఉంది. అంటే, ఈ టీవీ అల్ట్రా హై డెఫినేషన్(UHD) 4K LED స్క్రీన్ కలిగివుంటుంది మరియు ఇది VA ప్యానల్. మీ టీవీ అనుభవాన్ని మరింతగా పెంచడానికి ఇందులో Dolby Vision సపోర్ట్ ను అందించింది. ఈ టీవీలో ఆండ్రాయిడ్ 11 OS తో గూగుల్ ప్లే స్టోర్ సౌకర్యం కూడా ఉంది. అదనంగా, వినియోగదారులు ఈ స్మార్ట్ టీవీలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, Google Play  మరియు యూట్యూబ్ యాప్స్ డైరెక్ట్ బటన్ కలిగి ఉంటారు.

టీవీ యొక్క ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ టీవీకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 2 GB ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇక ఆడియో విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీలో మంచి సౌండ్ కోసం Dolby Atmos సౌండ్ సిస్టమ్ లభిస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్ టీవీ కనెక్షన్ కోసం Wi-Fi , బ్లూటూత్ మరియు HDMI  మరియు USB వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo