SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన Flipkart.!

HIGHLIGHTS

SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది

ఈ టీవీ 4K X-Reality Pro తో గొప్ప విజువల్స్ అందిస్తుంది

SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన Flipkart.!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇండియన్ మార్కెట్లో ప్రీమియం ధరలో వచ్చిన ఈ సోనీ స్మార్ట్ టీవీ ఈరోజు గొప్ప డిస్కౌంట్ అందుకుని ముందెన్నడూ చూడని ధరలో లభిస్తోంది. ఈ స్మృతి టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ మరియు ఈ టీవీ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

SONY Bravia 2 : ఆఫర్ 

సోనీ బ్రావియా 2 55 ఇంచ్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 74,990 రూపాయల ప్రైస్ ర్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ సోనీ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి రూ. 17,009 రూపాయల గొప్ప డిస్కౌంట్ అందుకొని రూ. 57,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ లభించడం ఇదే మొదటిసారి అవుతుంది.   

ఈ సోనీ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ నుంచి  HDFC బ్యాంక్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 5,000 రూపాయల భారీ అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సోనీ స్మార్ట్ టీవీ కేవలం రూ. 52,990 ధరకు లభిస్తుంది. ఏదైనా బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ లేదా UPI పేమెంట్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి కూడా రూ. 1,500 తగ్గింపు లభిస్తుంది.

Also Read: Sennheiser ప్రీమియం Soundbar భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు లభిస్తోంది.!

SONY Bravia 2 : ఫీచర్స్

సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు Ultra HD (4K) 3840 x 2160 రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ సోనీ యొక్క పవర్ ఫుల్ X1 4K Processor తో పని చేస్తుంది మరియు 4K X-Reality Pro గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ చాలా స్లీక్ గా మరియు వాయిస్ సెర్చ్ రిమోట్ తో వస్తుంది. 

SONY Bravia 2

ఈ సోనీ బ్రావియా స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 20W డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ ఆటో మేటిక్ లో లెటెన్సీ (ALLM) మోడ్ తో PlayStation 5 పై కూడా గొప్ప గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ టీవీ Alexa తో పని చేస్తుంది మరియు బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ తో ఉంటుంది. ఈ టీవీ HDMI 2.1, eARC, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile