LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

లేటెస్ట్ గా విడుదల చేసిన LG Nano Smart Tv పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ఈ టీవీ లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది మరియు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఈ టీవీ సూపర్ క్లియర్ విజువల్స్ అందిస్తుంది మరియు దానికి తగిన గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది

ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్ జి ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన LG Nano Smart Tv పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ టీవీ లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది మరియు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ టీవీ సూపర్ క్లియర్ విజువల్స్ అందిస్తుంది మరియు దానికి తగిన గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.

LG Nano Smart Tv : ఆఫర్

ఎల్ జి కొత్త విడుదల చేసిన AI NANO NU87 సిరీస్ 55 ఇంచ్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ ఫ్లిప్ కార్ట్ అందించింది. ఎల్ జి ఈ టీవీని రూ. 45,999 ధార్తో లాంచ్ చేసింది మరియు ఫ్లిప్ కార్ట్ ఈ టీవీని ఈరోజు ఇదే ధరతో సేల్ చేస్తోంది. అయితే, ఈ టీవీ పై లేటెస్ట్ సేల్ నుంచి భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.

బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ పై SBI, HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 5,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, Axis క్రెడిట్ కార్డ్ పై రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 40,999 బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ ధరలో సాధారణ 4కె టీవీలు లభిస్తుండగా, ఎల్ జి మాత్రం నానో టెక్ స్మార్ట్ టీవీ ఆఫర్ చేస్తోంది.

Also Read: Redmi Turbo 5: అప్ కమింగ్ ఫోన్ అనౌన్స్ చేసిన షియోమీ.. ఫోన్ ఎలా ఉందంటే.!

LG Nano Smart Tv : ఫీచర్స్

ఈ టీవీ నానో స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఇది 55 ఇంచ్ పరిమాణంతో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఎల్ జి టీవీ కంపెనీ యొక్క లేటెస్ట్ α7 AI Processor 4K Gen9 ప్రోసెసర్ తో నడుస్తుంది. ఇది కొత్త తరం ప్రోసెసర్ మరియు AI ఇంటెలిజెన్స్ తో వస్తుంది. ఇది గూగుల్ మరియు Copilot Ai సెర్చ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, AI వాయిస్ సెర్చ్ తో పాటు మరిన్ని AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఇక స్క్రీన్ ఫీచర్స్ చూస్తే, ఇది AI HDR రీ మాస్టరింగ్, డైనమిక్ టోన్ మ్యాపింగ్, ప్రెసిషన్ HDR మాస్టర్ ప్రో, HDR10, 4K అప్ స్కేలింగ్, 4K ఎక్స్ టెన్షన్ ఎన్ హెన్సర్ మరియు HLG వంటి ఫీచర్స్ తో గొప్ప ఆకట్టుకునే విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ రెండు ఉఫర్ స్పీకర్ లను కలిగి ఉంటుంది. అయితే, ఇది AI Sound Pro తో వర్చువల్ 9.1.2 అప్ మిక్స్ సౌండ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంది.

ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :