25 వేల ధరలో కొత్త 55 ఇంచ్ 4K Smart Tv కొనడమే మీ టార్గెట్ అయితే .. ఇదే బెస్ట్ డీల్.!
భారతదేశంలో ప్రస్తుతం స్మార్ట్ టీవీ ధరలు చాలా తక్కువ ప్రైస్ స్లాబ్ కి చేరుకున్నాయి
గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను అందించడంతో టీవీలు మరింత చవక ధరలో లభిస్తున్నాయి
25 వేల ధరలో కొత్త 55 ఇంచ్ 4K Smart Tv డీల్ ఈరోజు అందుబాటులో ఉంది
భారతదేశంలో ప్రస్తుతం స్మార్ట్ టీవీ ధరలు చాలా తక్కువ ప్రైస్ స్లాబ్ కి చేరుకున్నాయి. దీనికి తోడు ఆన్లైన్ స్టోర్స్ మరియు ఈ-కార్ట్ ప్లాట్ ఫామ్స్ టీవీల పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను అందించడంతో టీవీలు మరింత చవక ధరలో లభిస్తున్నాయి. అయితే, ప్రతి ఒక్కరికి టీవీ కొనడానికి ఒక బడ్జెట్ టార్గెట్ ఉంటుంది. ఈ టార్గెట్ ని బేస్ చేసుకుని మాత్రమే వారు ఆ బడ్జెట్ ధర లోపలే వారికి అవసరమైన టీవీని కొనడానికి ఇష్టపడతారు. 25 వేల ధరలో కొత్త 55 ఇంచ్ 4K Smart Tv కొనడమే మీ టార్గెట్ అయితే, ఈ రోజు మీకోసం ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మీ టార్గెట్ ధరలో అందుబాటులో ఉంది.
55 ఇంచ్ 4K Smart Tv : ఆఫర్
ఈరోజు కేవలం 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో మీకు Coocaa Y74 Plus 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ ని ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అందించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన ఏకంగా 51 శాతం భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 26,863 రూపాయల అతి చవక ధరలో సేల్ చేస్తుంది.
కేవలం సేల్ డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ SBI అండ్ ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,344 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ మీకు కేవలం రూ. 25,519 రూపాయల ఆఫర్ ధరలో మీకు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి లభిస్తుంది.
Also Read: ఫ్లిప్ కార్ట్ Black Friday సేల్ నుంచి 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ అత్యల్ప ధరలో లభిస్తోంది.!
55 ఇంచ్ 4K Smart Tv : ఫీచర్స్
ఈ కూకా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ LED స్క్రీన్ ని 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, HLG మరియు MEMC వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్, 2 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్స్ తో ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ఈ టీవీ సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి టోటల్ 21W సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్టు కలిగి మీకు మంచి ఆడియో ఎక్స్ పీరియన్స్ కూడా అందిస్తుంది. అలాగే, ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, ఆప్టికల్ అవుట్ పుట్, ఈతర్నెట్, HDMI, USB మరియు AV వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.