are you searching for big 4K UHD Smart Tv under 17k price today
Smart Tv: 17 వేల ధరలో పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు మీకోసం బెస్ట్ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TCL యొక్క ఉప బ్రాండ్ iFFALCON లేటెస్ట్ 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో 17 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తోంది. ఈ ఆఫర్ మీకు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
TCL యొక్క ఉప బ్రాండ్ iFFALCON లేటెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (43U65) పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 62% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 18,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని మరింత చవక ధరకు అందుకోవడానికి వీలుగా గొప్ప బ్యాంక్ ఆఫర్ ను కూడా అందించింది.
ఈ స్మార్ట్ టీవీని BOBCARD EMI క్రెడిట్ కార్డు ఆప్షన్ తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 17,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ ధరలో అందించే ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.
Also Read: Amazfit Bip 6: బడ్జెట్ ధరలో ఖచ్చితమైన హెల్త్ మోనిటరింగ్ మరియు GPS తో లాంచ్ అయ్యింది.!
ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ AiPQ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10 ఫీచర్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS X సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఇందులో టోటల్ 24W సౌండ్ అందించే ఇంటిగ్రేటెడ్ బాక్స్ స్పీకర్లు ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ USB, HDMI,LAN, AV IN, హెడ్ ఫోన్, గూగుల్ అసిస్టెంట్, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ WiFi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.