amazon offers big discount offers on LG 55 inch smart tv
LG 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇది భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ అందించిన అన్ని ఆఫర్లతో కలిగి ఎన్నడూ లేనంత చవక ధరలో లభిస్తుంది. ఇంటికి తగిన కొత్త టీవీ కోసం చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ రోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న డీల్ ను పరిశీలించవచ్చు.
ఎల్ జి మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UR75006LC ఈరోజు అమెజాన్ ఇండియా నుండి 39% భారీ డిస్కౌంట్ తో రూ. 43,990 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై మరో రెండు ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది అందుకే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు తక్కువ ధరలో లభిస్తుంది.
అమెజాన్ ప్రకటించిన ఆ రెండు ఆఫర్ల విషయానికి వస్తే, ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,000 రూపాయల బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై ఏకంగా 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ ను అందుకునే అవకాశం అమెజాన్ ఈరోజు తన యూజర్లకి అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 38,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Vivo T4R స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్లు మరియు ప్రైస్ రివీల్ చేసిన వివో.!
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840×2160) రిజల్యూషన్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ α5 AI ప్రోసెసర్ 4K జెన్6 తో పని చేస్తుంది మరియు జతగా 1.5 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, AI బ్రైట్నెస్ కంట్రోల్, ఫిల్మ్ మేకర్ మోడ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.
ఇక ఈ టీవీ డిజైన్ మరియు సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ చాలా సన్నని అంచులు కలిగిన బెజెల్ లెస్ డిజైన్ ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ కలిగి ఉంటుంది. అయితే, ఈ టీవీ వర్చువల్ సరౌండ్ 5.1 అప్ మిక్స్ ఫీచర్ తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్, ఈథర్నెట్, HDMI, USB మరియు Av ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.