Samsung Smart Tv సిరీస్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

Samsung Smart Tv సిరీస్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లు అందించింది

Crystal 4K Vista సిరీస్ నుంచి అందించిన అన్ని టీవీ లపై అమెజాన్ డీల్స్ అందించింది

ఈ స్మార్ట్ టీవీ లపై భారీ కూపన్ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్స్ అందించింది

Samsung Smart Tv సిరీస్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన అమెజాన్.!

Samsung Smart Tv సిరీస్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లు అందించింది. శాంసంగ్ గత సంవత్సరం ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Crystal 4K Vista సిరీస్ నుంచి అందించిన అన్ని టీవీ లపై అమెజాన్ డీల్స్ అందించింది. అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ లపై భారీ కూపన్ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్స్ అందించింది. అందుకే, ఈ సిరీస్ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Smart Tv : ఆఫర్

శాంసంగ్ క్రిస్టల్ 4కె విస్తా సిరీస్ నుంచి అందించిన 43 ఇంచ్ 50 ఇంచ్ మరియు 55 ఇంచ్ మూడు స్మార్ట్ టీవీ లపై రోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ మూడు స్మార్ట్ టీవీ లపై అందించిన ఆఫర్స్ ముందుగా చూద్దాం. 43 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 28,490 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ టీవీపై రూ. 2,500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,424 రూపాయల HSBC బ్యాంకు డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 24,566 ధరలో లభిస్తుంది.

Samsung Smart Tv offer on amazon

అలాగే, 50 ఇంచ్ టీవీ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,949 రూపాయల HSBC డిస్కౌంట్ తో కేవలం రూ. 35,041 రూపాయల ధరలో సేల్ చేస్తోంది. ఒక 55 ఇంచ్ స్మార్ట్ టీవీ విషయానికి వస్తే, ఈ టీవీపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ టీవీ పై రూ. 4,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,049 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం రూ. 34,941 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ లను ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పై క్లిక్ చేయండి.

Also Read: e-Ration Card PDF ఎలా డౌన్‌ లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకోండి.!

Samsung Smart Tv :

ఈ స్మార్ట్ టీవీ సిరీస్ టీవీలు LED డిస్‌ప్లే కలిగి ఉంటాయి. ఈ టీవీలు 4K UHD (3840 x 2160) పిక్సెల్స్ రిజల్యూషన్‌ తో ప్రతి సన్నివేశం స్పష్టంగా పీక్ డీటెయిల్స్ తో అందిస్తుంది. శాంసంగ్ ప్రత్యేకంగా అందించే Crystal Processor 4K టెక్నాలజీ ద్వారా తక్కువ నాణ్యత గల కంటెంట్‌ ను కూడా 4K స్థాయికి అప్‌ స్కేల్ చేస్తుంది. దీనితో సినిమాలు, వెబ్ సిరీస్‌ లు మరియు క్రీడా కార్యక్రమాలు కూడా మరింత సహజమైన రంగులతో కనిపిస్తాయి. ఈ టీవీ శాంసంగ్ యొక్క Tizen Smart OS పై పనిచేస్తుంది. ఇందులో 125 కి పైగా ఉచిత ఛానళ్లకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.

ఈ టీవీలలో 20W స్పీకర్ అవుట్‌ పుట్ లభిస్తుంది. OTS Lite, అడాప్టివ్ సౌండ్, Q-Symphony వంటి ఆడియో టెక్నాలజీ ఈ టీవిలో ఉన్నాయి. గేమింగ్ ప్రియుల కోసం ఆటో లో లేటెన్సీ మోడ్ (ALLM), VRR, HGiG వంటి ఫీచర్లను అందించారు. ప్లే స్టేషన్ మరియు Xbox వంటి కన్సోల్‌ లతో మెరుగైన గేమింగ్ అనుభవం లభిస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్టులు, 1 USB పోర్ట్, బిల్ట్ ఇన్ Wi-Fi, ఆప్టికల్, AV మరియు ఈథర్నెట్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఈ టీవిలో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile