Digit.in

రూ. 6,000 బడ్జెట్ ధరలో ప్యూర్ ఆడియో కోరుకుంటే .. ఈ మూడు Soundbar లను చూడొచ్చు.!

Highlights

ప్రస్తుతం మార్కెట్లో అనేక ఆడియో ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి

కేవలం రూ. 6,000 బడ్జెట్ ధరలో ప్యూర్ ఆడియో అందించే మంచి సౌండ్ బార్ లు ఉన్నాయి

బెస్ట్ ఫీచర్స్ కలిగి ఒక మూడు Soundbar లను మీరు ఈరోజు ఇక్కడ చూడవచ్చు

రూ. 6,000 బడ్జెట్ ధరలో ప్యూర్ ఆడియో కోరుకుంటే .. ఈ మూడు Soundbar లను చూడొచ్చు.!

ప్రస్తుతం మార్కెట్లో అనేక ఆడియో ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, హోమ్ ఆడియో కోసం ఇప్పుడు హోమ్ థియేటర్ స్థానాన్ని సౌండ్ బార్ భర్తీ చేస్తోంది. అందుకే, మార్కెట్ లో కుప్పలు తెప్పలుగా సౌండ్ బార్ లు లాంచ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని అంతగా ఆకట్టుకోలేక పోతే, కొన్ని సౌండ్ బార్స్ మాత్రం యూజర్ల నుంచి మంచి స్పందన అందుకుంటున్నాయి. ముఖ్యంగా, బడ్జెట్ ధరలో లభించే సౌండ్ బార్ లు ఎక్కువగా మార్కెట్ ని ఆకట్టుకుంటాయి. కేవలం రూ. 6,000 బడ్జెట్ ధరలో ప్యూర్ ఆడియో కోరుకుంటే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సౌండ్ బార్స్ లో చాలా మంచి సౌండ్ బార్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఫీచర్స్ కలిగి ఒక మూడు Soundbar లను మీరు ఈరోజు ఇక్కడ చూడవచ్చు.

రూ. 6,000 బడ్జెట్ ధరలో వచ్చే Soundbar

కేవలం రూ. 6,000 బడ్జెట్ ధరలో ప్యూర్ ఆడియో అనుభూతిని అందించే సౌండ్ బార్ లలో బెస్ట్ 3 సౌండ్ బార్ వివరాలు ఈరోజు చూడనున్నాము. ఈ లిస్ట్ లో boAt Aavante 2.1 1600D, Zebronics Juke Bar 6500 మరియు GOVO Go Surround 900 మూడు సౌండ్ బార్స్ ఉన్నాయి. ఈ మూడు సౌండ్ బార్ ప్రైస్ అండ్ ఫీచర్స్ వివరాలు ఇక్కడ చూడొచ్చు.

GOVO Go Surround 900

ఇది కేవలం రూ. 5,999 రూపాయల ధరలో లభించే బడ్జెట్ సౌండ్ బార్. ఇది టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో నాలుగు 2.25 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు 6.5 ఇంచ్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (DSP) ఎనేబుల్ తో మంచి ఆడియో అందిస్తుంది. అంతేకాదు, ఇది ప్రత్యేకమైన ఈక్వలైజర్ మోడ్స్ మరియు HDMI (ARC), AUX, USB అండ్ బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. Buy From Here

soundbar deals under rs 6000 in market

Zebronics Juke Bar 6500

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ రూ. 6,999 ధరలో లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ సౌండ్ బార్ ని అమెజాన్ అండ్ ఫ్లిప్ కార్ట్ అందించే బ్యాంక్ ఆఫర్స్ తో కొనుగోలు చేస్తే రూ. 6,499 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా 200W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి ఆడియో అందిస్తుంది. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ అయినా కూడా 5.1 ఛానల్ వర్చువల్ సరౌండ్ సౌండ్ తో గొప్ప త్రీడీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా బ్లూటూత్ ఆప్టికల్ ఇన్పుట్ మరియు HDMI (ARC), AUX, USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. Buy From Here

boAt Aavante 2.1 1600D

ఈ సౌండ్ బార్ ప్రస్తుతం రూ. 6,499 ప్రైస్ తో సేల్ అవుతోంది మరియు అమెజాన్ బ్యాంక్ ఆఫర్స్ తో కేవలం రూ. 5,999 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్టుతో సినిమా థియేటర్ అంటే గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో బాస్ సిగ్నేచర్ బాస్ సౌండ్ తో మంచి మ్యూజిక్ ని మీరు ఆస్వాదించవచ్చు. ఈ సౌండ్ బార్ టోటల్ 160 వాట్ సౌండ్ అవుట్ పుట్ ని ఆఫర్ చేస్తుంది. ఇది కూడా HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile