Digit.in

HMD Rise: బడ్జెట్ ధరలో సైలెంట్ గా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన హెచ్ఎండి.!

Highlights

ఇండియన్ మార్కెట్లో హెచ్ఎండి తన కొత్త స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది

HMD Rise ఫోన్ ని కేవలం బడ్జెట్ ధరలో సైలెంట్ గా విడుదల చేసి మార్కెట్ ని ఆశ్చర్య పరిచింది

సరికొత్త డిజైన్ మరియు బడ్జెట్ యూజర్ కి అవసరమైన అన్ని ఫీచర్స్ ని కలిగి ఉంటుంది

HMD Rise: బడ్జెట్ ధరలో సైలెంట్ గా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన హెచ్ఎండి.!

HMD Rise: ఇండియన్ మార్కెట్లో హెచ్ఎండి తన కొత్త స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ని కేవలం బడ్జెట్ ధరలో సైలెంట్ గా విడుదల చేసి మార్కెట్ ని ఆశ్చర్య పరిచింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే సరికొత్త డిజైన్ మరియు బడ్జెట్ యూజర్ కి అవసరమైన అన్ని ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. మరి హెచ్ఎండి సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

HMD Rise: ప్రైస్

హెచ్ఎండి ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని కేవలం రూ. 9,999 రూపాయల లాంచ్ ఆఫర్ ప్రైస్ తో విడుదల చేసింది. అయితే, ఇది అన్ని ఆఫర్స్ తో మొదటి రోజు లభించే ప్రైస్ మాత్రమే అని కండిషన్ పెట్టింది. అలాగే, ఈ ఫోన్ 4GB + 64GB వేరియంట్ ప్రైస్ ఇది అని గమనించాలి. ఈ ఫోన్ ఏమిరాల్డ్ గోల్డ్, ఇండిగో సిల్వర్ మరియు మిడ్ నైట్ గోల్డ్ అనే మూడు సరికొత్త రంగుల్లో లభిస్తుంది. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుంది.

HMD Rise: ఫీచర్స్

ఇది హెచ్ఎండి అందించిన లేటెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్ మరియు బడ్జెట్ యూజర్ కి అవసరమైన అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. హెచ్ఎండి ఈ ఫోన్ ని డ్యూయల్ టోన్ ప్రీమియం డిజైన్ తో చాలా అందంగా అందించింది. ఇందులో 6.5 ఇంచ్ LCD స్క్రీన్ ని HD డిస్ప్లే తో అందించింది. ఈ ఫోన్ Unisoc 9863A చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 4 జీబీ ర్యామ్ అండ్ 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

HMD Rise price

ఈ ఫోన్ నాలో వెనుక 13MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సర్వం AI సపోర్ట్ తో 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ ఉంది. అలాగే, ఈ ఫోన్ యూనివర్సల్ ఛార్జ్ పోర్ట్ టైప్ C పోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 Go ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది. బ్లోట్ వేర్ లేకుండా క్లీన్ మొబైల్ అనుభూతిని ఈ ఫోన్ అందిస్తుంది. బడ్జెట్ ధరలో రోజు వారి అవసరాలకు అవసరమైన అన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile