జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ : రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్

జియో VS ఎయిర్టెల్ VS వోడాఫోన్ : రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్
HIGHLIGHTS

ఎక్కువ ప్రయోజనాలను ఏ టెలికం అందిస్తుందో ఇప్పుడు చూదాం.

టెలికం రంగంలో ప్రస్తుతం నడుస్తున్న పోటీ రసవత్తరంగా మారింది. ముందు నుండి దాదాపుగా అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ తో అధిక ప్రయోజనాలను అందిస్తున్న రిలయన్స్ జియో, ప్రస్తుతం ట్రాయ్ యొక్క నిభంధనలకు అనుగుణంగా తన ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క ధరలను పెంచేసింది. అయితే, ఇటీవల వోడాఫోన్ మరియు ఎయిర్టెల్ టెలికం ఆపరేటర్లు కూడా తమ ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క ధరలను అమాంతంగా పెంచేసాయి. కానీ, బడ్జెట్ వినియోగదారులకే కాకుండా ఒక నెలకు రీఛార్జ్ చేసే వారు ఎక్కువగా మక్కువ చూపే బేస్ ప్లాన్ అయినటువంటి, రూ.149 ప్రీపెయిడ్ ప్లానుతో ఎక్కువ ప్రయోజనాలను  టెలికం అందిస్తుందో ఇప్పుడు చూదాం.

రిలయన్స్ జియో : రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్

ముందుగా, రిలయన్స్ జియో యొక్క 149 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందని పరిశీలిద్దాము. ఇది రోజుకు  1GB డేటాతో మొత్తంగా 24GB డేటా తో వస్తుంది. ఇక కాలింగ్ లో జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలతో పాటుగా ఇతర నెట్వర్క్ కాలింగ్ కోసం కేవలం 300 నిముషాల FUP లిమిట్ తో వస్తుంది. అలాగే, ప్రతిరోజూ 100 SMS ల పరిమితో ఉంటుంది . ఇది 24 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. 

భారతి ఎయిర్టెల్ :  Rs.149 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది ఉత్తమ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తుంది. ఈ భారతి ఎయిర్టెల్ యొక్క రూ. 149 ప్లానుతో రీఛార్జ్ తో, పూర్తి వ్యాలిడిటీ కి గాను 2GB డేటా మాత్రమే అందుతుంది. అయితే, కాలింగ్ కోసం లోకల్  మరియు STD కాల్స్ ఎటువంటి నెట్వర్కు అయినా సరే  అన్లిమిటెడ్ కాలింగ్ చెసుకోవచ్చు. అధనంగా 300 SMS లు కూడా అందిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. వీటితో పాటుగా, Airtel Xtream App యొక్క సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.  

వోడాఫోన్:Rs.149 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ యొక్క 149 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పూర్తి వ్యాలిడిటీకి గాను మొత్తంగా 2GB డేటాతో వస్తుంది. అయితే, ఏ నెట్వర్కైనా సరే అన్లిమిటెడ్ లోకల్  మరియు ఎస్టీడీ కాల్స్ అందుబాటులో ఉంటాయి. అధనంగా, మొత్తం చెల్లుబాటు కాలానికి గాను 300 SMSల పరిమితితో ఉంటుంది. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. వీటితో పాటుగా, Zee5 యొక్క 999 రూపాయల విలువగల సబ్ స్క్రిప్షన్ కూడా అఫర్ చేస్తోంది.                     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo