క్రొత్త 180 రోజుల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచిన వోడాఫోన్
వోడాఫోన్ రూ. 154 ధరతో ఒక క్రొత్త 180 రోజుల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తోంది.
వోడాఫోన్, రూ. 154 ధరతో ఒక క్రొత్త దీర్ఘకాలిక ప్రీపెయిడ్ తీసుకొచ్చింది. ఈ దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్రణాళికను 180 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది.దీనితో పాటుగా 600 లోకల్ ఆన్ నెట్ నైట్ మినిట్స్ కూడా అందిస్తోంది.అంటే, వోడాఫోన్ నుండి వోడాఫోన్ నంబర్లకు మాత్రమే కాలింగ్ చేసుకోవడానికి ఈ 600 లోకల్ ఆన్ నెట్ నైట్ మినిట్స్ ఉపయోగపడతాయి.
Surveyరూ. 154 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ఈ రూ. 154 ప్రీపెయిడ్ ప్లాన్ను కేవలం తక్కువ ధరలో అధిక వ్యాలిడిటీ కోసం మాత్రమే తీసుకొచ్చినట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే, ప్రీపెయిడ్ ప్లానుతో మీకు ఎటువంటి డేటా లేదా ఉచిత లోకల్ మరియు STD కాల్స్ మీకు లభించవు. కానీ, ఈ రూ. 154 ప్రీపెయిడ్ ప్లానుతో 600 లోకల్ ఆన్ నెట్ నైట్ మినిట్స్ అందుకుంటారు.
దీనితో, వోడాఫోన్ నుండి వోడాఫోన్ నంబర్లకు మాత్రమే కాలింగ్ చేసుకోవచ్చు. అయితే, ఈ 600 లోకల్ ఆన్ నెట్ నైట్ మినిట్స్ కాలింగ్ కోసం ఒక నిర్దిష్ట సమయం కూడా ఉంటుంది. దీనితో, రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటలకు వరకు మాత్రమే కాలింగ్ చేసుకోవచ్చు, అదికూడా వోడాఫోన్ నంబర్లకు మాత్రమే.
అలాగే, వోడాఫోన్ రూ.209 మరియు రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్ల పైన రోజువారీ డేటాని పెంచింది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లతో రోజువారి 1.5GB డేటా అందిస్తుండగా, ఇప్పుడు దీనిపైన 100 MB డేటాని పెంచింది. అంటే, ఇప్పుడు రూ.209 మరియు రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్లతో రోజువారీ 1.6GB డేటాని వినియోగదారులు పొందుతారు. అలాగే, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ 100 SMS ప్రయోజనాలు కూడా వినియోగదారులకి అందుతాయి. రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, ఈ రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile