2GB మరియు 4GB డాటాతో VODAFONE రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది.

2GB మరియు 4GB డాటాతో VODAFONE రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది.
HIGHLIGHTS

ఇవి రూ .205 మరియు రూ .225 ధరలతో వచ్చాయి.

టెలికం రంగంలో, ఒకరిని మించి ఒకరు తమ స్థానాలను పైకి తీసుకురావడానికి,  రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ ఒకరిని మించి మరొకరు కొత్త చర్యలు తీసుకుంటున్నారు. టెలికాం టాక్ యొక్క నివేదిక ప్రకారం, ఈసారి వోడాఫోన్ తన పోర్ట్ ఫోలియోలో రెండు కొత్త ప్లాన్‌లను విడుదల చేసింది, ఇవి ప్రీపెయిడ్ ప్లాన్లు. ఇది రూ .205 మరియు రూ .225 ధరలతో వచ్చాయి.

వొడాఫోన్ కొత్త రూ .205 ప్లాన్

వోడాఫోన్ యొక్క మొదటి ప్రీపెయిడ్ ప్లాన్ రూ .205 ధరలో వస్తుంది, ఇది బోనస్ కార్డ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్, ఉచిత కాల్స్ మరియు డేటాను అందిస్తుంది. ఈ ఈ ప్లానుతో,  చందాదారులకు పూర్తి చెల్లుబాటు కాలానికి గాను 2 జీబీ డేటాని ఇస్తుంది. అయితే, అపరిమిత లోకల్, ఎస్టీడీ మరియు రోమింగ్ కాల్స్ దీనితో వస్తాయి. ఇది కాకుండా, వినియోగదారులు పూర్తి వ్యాలిడిటీ కాలానికి  600 ఉచిత SMS లను కూడా పొందుతారు. అయితే, ఈ ప్రణాళిక పూర్తిగా 35 రోజుల  చెల్లుబాటుతో వస్తుంది. వినియోగదారులు వోడాఫోన్ ప్లే ఆప్ నుండి LIVE టీవీ, సినిమాలు మరియు మరిన్ని చూడవచ్చు.

వోడాఫోన్ కొత్త రూ .225 ప్లాన్

రూ .225 యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ కూడా బోనస్ కార్డు మరియు ఈ రీఛార్జ్ మునుపటి రీఛార్జ్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 225 రూపాయలకు వోడాఫోన్ ప్లాన్ చెల్లుబాటు 48 రోజులు మరియు రీఛార్జ్‌లో టాక్ టైమ్ బెనిఫిట్ అందుబాటులో లేదు. వోడాఫోన్ యొక్క ఈ రీఛార్జ్ ప్లాన్ ఉచిత లోకల్, ఎస్టీడీ మరియు రోమింగ్ కాల్‌లను అందిస్తుంది. అలాగే, వినియోగదారులు మొత్తం వ్యవధిలో 4 జిబి డేటాను ఉపయోగించవచ్చు. ఈ ప్రణాళికలో, వినియోగదారులకు మొత్తం కాలవ్యవధికి గాను 600 SMS కోడోత్ ఇవ్వబడుతుంది మరియు వినియోగదారులు వోడాఫోన్ ప్లే నుండి LIVE టీవీ, సినిమాలు మరియు మరిన్ని పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo