HIGHLIGHTS
Vi కస్టమర్లకు గుడ్ న్యూస్
Vi యూజర్లకు ఉచిత హై స్పీడ్ డేటా
రాత్రి 12 గంటల నుండి మొదలుకొని ఉదయం 6 గంటల వరకూ
ఇండియాలో తన యూజర్ బేస్ సంఖ్యను పెంచుకునేందుకు Vi కొత్త ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా, అనేక సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు ఆఫర్లను కూడా ప్రకటించింది. అయితే, ఇప్పుడు తన యూజర్లకు ఉచిత హై స్పీడ్ డేటాని ఇస్తున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరించింది.
SurveyVi కొత్తగా చేసిన తన ప్రకటనలో Vi యూజర్లకు Hi-Speed డేటాని ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, దీనికి కొన్ని షరతులు కూడా పెట్టింది. ఈ Hi-Speed ఉచిత డేటాని యూజర్లు కేవలం రాత్రి 12 గంటల నుండి మొదలుకొని ఉదయం 6 గంటల వరకూ మాత్రమే వాడుకునే వీలుంటుంది. అంతేకాదు, రూ. 249 రూపాయలు అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసే కస్టమర్లకు మాత్రమే ఈ ఉచిత డేటా వర్తిస్తుంది.
నేటికాలంలో, ఇంటర్నెట్ మరియు OTT లలో నైట్ బింగింగ్ పెరుగుతోంది, ప్రత్యేకించి ప్రజలు సౌకర్యవంతమైన డౌన్ లోడ్ సమయాల్లో తమ పనిని నిర్వహిస్తుంటారు మరియు ఎక్కువ సమయం తీసుకునే కంటెంట్ తో గడుపుతారు. అందుకే,కస్టమర్ల యొక్క ఈ డిమాండ్ ను తీర్చడానికి, తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా, ఎటువంటి పరిమితులు లేకుండా హై-స్పీడ్ నైట్-టైమ్ డేటాను ఉచితంగా Vi తన యూజర్ల కోసం ప్రకటించింది.