ఈ రిలయన్స్ జియో ప్లాన్స్ తో IPL మ్యాచ్ లను ఫ్రీ గా ఎంజాయ్ చెయ్యండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 03 May 2021
HIGHLIGHTS
  • జియో కస్టమర్ల కోసం చాలా మంచి ప్లాన్స్

  • IPL 2021 సీజన్ అన్ని మ్యాచ్ లు ఫ్రీ

  • ఉచితంగా అఫర్ చేసే ప్రీపెయిడ్ ప్లాన్స్

ఈ రిలయన్స్ జియో ప్లాన్స్ తో IPL మ్యాచ్ లను ఫ్రీ గా ఎంజాయ్ చెయ్యండి
ఈ రిలయన్స్ జియో ప్లాన్స్ తో IPL మ్యాచ్ లను ఫ్రీ గా ఎంజాయ్ చెయ్యండి

రిలయన్స్ జియో ప్లాన్స్ తో IPL మ్యాచ్ లను ఫ్రీ గా ఎంజాయ్ చెయ్యండి. ఎలా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా! రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం చాలా మంచి ప్లాన్స్ అందించింది. వాటిలో, డిస్నీ+ హాట్ స్టార్ VIP సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేసే ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్స్ ను రీఛార్జ్ చేసే వారికీ  IPL 2021 సీజన్ అన్ని మ్యాచ్ లను ఫ్రీ గా ఎంజాయ్ చేయడమేకాకుండా పూర్తిగా ఒక సంవత్సరం మొత్తం మూవీలు మరియు కార్యక్రమాలను కూడా ఆనదించవచ్చు. రిలయన్స్ జియో యొక్క ఆ ప్లాన్స్ గురించి చూద్దాం.

రిలయన్స్ జియో రూ.401 ప్లాన్

రిలయన్స్ జియో కస్టమర్లకు ఎక్కువ డేటా మరియు మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది ఈ రూ.401 ప్లాన్.  ఎందుకంటే, ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 3జిబి హై స్పీడ్ డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 84GB డేటా మరియు అదనపు 6GB ఉచిత డేటాతో కలిపి మొత్తం 90GB డేటాతో వస్తుంది మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు. అధనంగా, ఈ ప్లాన్ తో రూ.399 రూపాయల విలువ గల డిస్నీ+ హాట్ స్టార్ VIP సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.   

రిలయన్స్ జియో రూ .598

ఈ రూ.401 ప్లాన్ కూడా మంచి ప్రయోజాలను అందిస్తుంది. ఎందుకంటే, ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 2 జిబి హై స్పీడ్ డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 112GB డేటా మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 56 రోజులు. అధనంగా, ఈ ప్లాన్ తో రూ.399 రూపాయల విలువ గల డిస్నీ+ హాట్ స్టార్ VIP సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.   

రిలయన్స్ జియో రూ.777

రిలయన్స్ జియో కస్టమర్లకు ఎక్కువ డేటా మరియు మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది ఈ రూ.777 ప్లాన్.  ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 1.5 జిబి హై స్పీడ్ డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 126GB డేటా మరియు అదనపు 5GB ఉచిత డేటాతో కలిపి మొత్తం 131GB డేటాతో వస్తుంది మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 84 రోజులు. అధనంగా, ఈ ప్లాన్ తో రూ.399 రూపాయల విలువ గల డిస్నీ+ హాట్ స్టార్ VIP సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.   

రిలయన్స్ జియో రూ .2,599

రిలయన్స్ జియో యొక్క ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 730 GB డేటాతో పాటుగా 10GB అధనపు ఉచిత డేటాతో కలిపి 740GB  డేటా మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 399 రుపాయల విలువగల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.

మరిన్ని ఇతర రిలయన్స్ జియో ప్లాన్స్ కోసం Click Here

logo
Raja Pullagura

email

Web Title: reliance jio unlimited plans with free disney hotstar subscription and more data plans
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status