రిలయన్స్ జియో సంచలనం : Reliance Jio 5G తో 5G Service కల నిజం చేస్తామంటోంది

రిలయన్స్ జియో సంచలనం : Reliance Jio 5G తో 5G Service కల నిజం చేస్తామంటోంది
HIGHLIGHTS

ఈరోజు జరిగిన 43 వ RIL AGM 2020 నుండి ఇండియా కోసం 5G సొల్యూషన్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.

Reliance Jio 5G ని మొదటి నుంచి భారతదేశంలో పరీక్షించామని అంబానీ తెలిపారు.

భారతదేశంలో 5G Spectrum అందుబాటులోకి వచ్చిన వెంటనే 5 జి సొల్యూషన్ ట్రయల్‌కు సిద్ధంగా ఉంటామని, వచ్చే ఏడాది నాటికి తమ ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్ ‌కు కంపెనీ సిద్ధంగా ఉందని అంబానీ తెలిపారు

ఇండియాలో మొదటిగా 4G ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో, ఇప్పుడు 5G ని కూడా మొదటగా ఇండియాలో ప్రకటించనుంది. ఈరోజు జరిగిన 43 వ RIL AGM 2020 నుండి ఇండియా కోసం 5G సొల్యూషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. Reliance Jio 5G  ని మొదటి నుంచి భారతదేశంలో పరీక్షించామని అంబానీ తెలిపారు. ఇది జియోను భారతదేశంలో "ప్రపంచ స్థాయి 5 జి సర్వీస్" గా ప్రారంభించటానికి వీలు కల్పిస్తుంది. భారతదేశంలో 5G Spectrum అందుబాటులోకి వచ్చిన వెంటనే 5 జి సొల్యూషన్ ట్రయల్‌కు సిద్ధంగా ఉంటామని, వచ్చే ఏడాది నాటికి తమ ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్ ‌కు కంపెనీ సిద్ధంగా ఉందని అంబానీ తెలిపారు.

Reliance AGM 2020 యొక్క లైవ్ స్ట్రీమ్ సందర్భంగా, Jio 5G ని భారతదేశంలోని ఇంజనీర్లు అభివృద్ధి చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ యొక్క "ఆత్మనిర్బర్ భారత్ " కోసం అంకితమిచ్చారని ముఖేష్ అంబానీ వెల్లడించారు. Reliance Jio 5G కోసం రోడ్‌మ్యాప్‌ను కూడా అంబానీ ప్రవేశపెట్టారు.  5G Spectrum అందుబాటులో ఉన్న వెంటనే భారతదేశంలో అందరికంటే ముందుగా India's First 5G Service ని పరీక్షిస్తుందని, ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్‌కు సిద్ధంగా ఉందని పేర్కొంది. జియో 5 జి సొల్యూషన్స్‌ను ప్రపంచంలోని ఇతర టెలికాం ఆపరేటర్లకు పూర్తిగా నిర్వహించే సర్వీస్ గా ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కూడా జియో యొక్క 4 G  నెట్‌వర్క్ ‌ను 5G  కి అప్ ‌గ్రేడ్ చేయడం చాలా సులభం అని తన అభిప్రాయాన్ని షేర్ చేశారు, దీని కోసం అతను అన్ని IP నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌ను గురించి ఆపాదించాడు, దీనితో ఇది ఆచరణ సాధ్యమవుతుంది.

 

 

"ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, మీడియా, ఆర్థిక సేవలు, కొత్త వాణిజ్య సేవలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ తయారీ మరియు స్మార్ట్ మొబిలిటీ వంటి అనేక పరిశ్రమల కోసం మంచి పరిష్కారాలను సృష్టించగలము" అని అంబానీ అన్నారు. '

అదనంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జియో ప్లాట్‌ ఫామ్‌ లలో రూ .33,737 కోట్లు గూగుల్ పెట్టుబడి పెట్టిందని పేర్కోన్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo