ధర పెంచిన జియో: రిలయన్స్ జియో ఈ యాడ్ ఆన్ ప్లాన్ ధరను పెంచింది

HIGHLIGHTS

రిలయన్స్ జియో తన రూ .222 యాడ్-ఆన్ టారిఫ్ ప్లాన్ ను 1 సంవత్సరం డిస్నీ + హాట్స్టార్ సభ్యత్వంతో అందించింది.

Jio ఇప్పుడు రూ .222 ప్లాన్ ధరను రూ.255 రూపాయలకు పెంచింది.

ఈ ప్లాన్ ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్‌లో ప్రవేశపెట్టబడింది.

ధర పెంచిన జియో: రిలయన్స్ జియో ఈ యాడ్ ఆన్ ప్లాన్ ధరను పెంచింది

రిలయన్స్ జియో తన రూ .222 యాడ్-ఆన్ టారిఫ్ ప్లాన్ ను 1 సంవత్సరం డిస్నీ + హాట్స్టార్ సభ్యత్వంతో అందించింది. అయితే, ఇప్పుడు ఈ ప్లాన్ ధరను రూ .222  నుంచి రూ.255 రూపాయలకు కంపెనీ పెంచింది. అంటే, ఇది అసలు ధర కంటే రూ .33 ఎక్కువ. Jio యొక్క ఈ ప్రత్యేకమైన పరిమిత కాల అప్డేట్ ఆఫర్, డిస్నీ + హాట్స్టార్ VIP యొక్క వార్షిక సభ్యత్వాన్ని అందిస్తుంది మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్‌లో ప్రవేశపెట్టబడింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో తన వినియోగదారులకు కొత్త టారిఫ్ ప్లాన్లు మరియు యాడ్ఆన్ ప్యాక్‌లతో వార్షిక డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాను అందిస్తోంది. అలాగే, ఇందులో భాగంగా, రూ .222 ధర గల ఒక యాడ్-ఆన్ ప్యాక్ ని కూడా వినియోగదారుల కోసం ప్రారంభించబడింది. కానీ, జియో సంస్థ ఇప్పుడు దాని ధరను రూ .255 కు పెంచింది. అయితే, దీనితో అందివచ్చే ప్రయోజనాలు మాత్రం అలాగే ఉన్నాయి.

జియో రూ .255 ప్లాన్ వివరాలు

జియో యొక్క రూ .255 యాడ్-ఆన్ వోచర్ డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క 1 సంవత్సర చందాతో పాటు 15 జిబి డేటాను అందిస్తుంది. అయితే, వినియోగదారులు ఇప్పటికే ఉన్న బేస్ ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుందని గమనించండి. ఏ యాడ్-ఆన్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత, వినియోగదారులు డిస్నీ + హాట్‌స్టార్ యాప్ ని డౌన్‌లోడ్ చేసి, వారి జియో నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

రిలయన్స్ జియో రూ .222 డిస్నీ + హాట్‌స్టార్ VIP యాడ్-ఆన్ ప్లాన్ ధరను పెంచుతుంది

డిస్నీ + హాట్‌స్టార్ సభ్యత్వం లేకుండా బేస్ ప్లాన్‌కు సభ్యత్వం పొందిన వినియోగదారులందరికీ రూ .255 ప్లాన్ అందుబాటులో ఉంది. రిలయన్స్ ప్రస్తుతం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సభ్యత్వంతో వచ్చే అనేక టారిఫ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్రసిద్ధ ప్లాన్లలో కొన్ని సంస్థ యొక్క కొత్త క్రికెట్ ప్యాక్‌లు మరియు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు ఉన్నాయి.

నెలవారీ డేటా ప్లాన్ కోసం జియో క్రికెట్ ప్యాక్ 401 రూపాయలతో మొదలవుతుంది. అయితే, రిలయన్స్ రెండు నెలల ప్లాన్‌ను 499 రూపాయలకు, త్రైమాసిక ప్లాన్ ను 777 రూపాయలకు మరియు వార్షిక ప్లాన్ ను 2,599 రూపాయలకు అందిస్తుంది. అన్ని క్రికెట్ ప్యాక్ ప్లాన్స్ కూడా డిస్నీ + హాట్‌స్టార్ యొక్క 1 సంవత్సర చందాతో వస్తాయి. కొన్ని యాడ్-ఆన్ ప్లాన్‌లలో 120 రోజుల వాలిడిటీ ఉన్న రూ .1,004 వోచర్, 180 రోజుల వాలిడిటీతో రూ .1,206 వోచర్, 240 రోజుల వాలిడిటీతో రూ .1,208 వోచర్ ఉన్నాయి.

డిస్నీ + హాట్‌స్టార్ ఏప్రిల్ 3 న భారతదేశంలో ప్రారంభించబడింది మరియు స్ట్రీమింగ్ సేవ రెండు స్థాయిలలో లభిస్తుంది. VIP ప్లాన్ ధర సంవత్సరానికి రూ .399 కాగా, ప్రీమియం ప్లాన్ ధర సంవత్సరానికి రూ .1,499.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo