5G నెట్వర్కులో మొదటి వీడియో కాల్ చేసినట్లు చెప్పిన ఒప్పో

5G నెట్వర్కులో మొదటి వీడియో కాల్ చేసినట్లు చెప్పిన ఒప్పో
HIGHLIGHTS

ఒప్పో ప్రకారం, WeChat నుండి 100 MHz బ్యాండ్విడ్త్ కంటే ఎక్కువ కలిగి ఉన్ననెట్వర్క్లో 17 నిమిషాల పాటు ఈ వీడియో కాల్ కొనసాగింది.

5G నెట్ వర్క్ ఉపయోగించి WeChat లో ప్రపంచం యొక్క మొట్టమొదటి బహుళ వీడియో కాల్ విజయవంతంగా చేసినట్లు Oppo ప్రకటించింది. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలలో ఉన్న ఆరు Oppo R & D కేంద్రాల్లోని ఇంజనీర్లు స్థానిక  12:57am  గంటలకు ప్రసిద్ధ చైనీస్ అనువర్తనం WeChat  ఉపయోగించి వీడియో కాల్లో పాల్గొన్నారు. Oppo R15 ప్రో ఫోన్ యొక్క 5G సామర్థ్యాల ద్వారా తయారు చేయబడిన స్మార్ట్ ఫోన్ ద్వారా చేసిన వీడియో కాల్ యొక్క ఫుటేజ్ను విడుదల చేసింది. ప్రారంభ సందేశంగా "హలో OPPO, హలో 5G" తో, ఈ కాల్ 100 MHz బ్యాండ్విడ్త్ కంటే ఎక్కువ కలిగి ఉన్ననెట్వర్క్లో 17 నిమిషాల పాటు కొనసాగింది.

ఒక నెల తరువాత, ఒప్పో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మరియు చైనా బిజినెస్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు బ్రియాన్ షెన్, మొదటిసారిగా ఓప్పో మొబైల్ ఫోన్ 5G ఇంటర్నెట్ యాక్సెస్ ను విజయవంతంగా పూర్తి చేసిందని పేర్కొన్నారు. వారి 5G కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ప్రయోగశాల వాతావరణంలో, OPPO R15 స్మార్ట్ ఫోన్ టెర్మినల్ మరియు 5G నెట్వర్క్ల మధ్య విజయవంతంగా చేసిందని, దాని వివరాలను బ్రియాన్ పోస్ట్ చేశారు. పరీక్షలో ఉపయోగించిన R15 ఫోన్ను పూర్తి సమిష్టిగా, RF, RFFE మరియు యాంటెన్నాతో సహా పూర్తిగా 5G భాగాలతో కస్టమైజ్ చేసారు. "5G" లోగో కూడా స్క్రీన్ కుడి ఎగువ మూలలో కనిపిస్తుందని, కంపెనీ తెలిపింది.

అలాగే బ్రాండ్ నిజమైన వాణిజ్య 5G స్మార్ట్ ఫోన్లను విడుదల చేయటానికి మొదటి బ్రాండ్గా పనిచేయాలని కంపెనీ ప్రయత్నిస్తుందని కూడా బ్రియాన్ అన్నారు. ఇటీవల బీజింగ్ 2018 క్వాల్కమ్ చైనా టెక్నాలజీ అండ్ కోఆపరేషన్ సమ్మిట్లో, OPPO 5G నెట్వరాక్ లతో  ఆవిష్కరణలను అన్వేషించడానికి "5G పైలట్" కార్యక్రమం కోసం క్వాల్కమ్ టెక్నాలజీస్ తో  భాగస్వామ్యాన్ని ప్రకటించింది. Oppo రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోర్ సాంకేతిక పరిజ్ఞాన పరిశోధనకు ముందుకొచ్చేలా మరియు సంస్థ భవిష్యత్ ఉత్పత్తి పోటీతత్వానికి సాంకేతిక అర్హతను రూపొందించడానికి కూడా ప్రారంభించబడింది.

మే 2018 లో, 3D నిర్మాణాత్మక లైట్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలో మొట్టమొదటి 5G వీడియో కాల్ ప్రదర్శనను విజయవంతంగా అమలు చేసినట్లు  ఒప్పో ప్రకటించింది. Oppo రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన 3D ఇమేజ్ కెమెరా, 3D పోర్ట్రైట్ సమాచారాన్ని స్వాధీనం చేయడానికి ఒక Oppo మొబైల్ ఫోన్తో అనుసంధానించబడింది. క్వాల్కమ్ 5G కొత్త ఎయిర్ ఇంటర్ఫేస్ టెర్మినల్ నమూనాను రిమోట్ రిసీవింగ్ డిస్ప్లేలో, చివరకు 3Dపోర్ట్రైట్ చిత్రాన్నిపునరుద్ధరించడానికి ఉపయోగించబడిందని, ఈ చైనీస్ కంపెనీ తెలిపింది. ఇక్కడ రాబోయే 5G స్మార్ట్ఫోన్ల గురించి మరింత తెలుసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo