జియో vs ఎయిర్టెల్ vs వోడాఫోన్ vs ఐడియా : 4G బెస్ట్ 3 నెలల ప్రీపెయిడ్ ప్లాన్స్

HIGHLIGHTS

ఈ అన్ని టెలికం సంస్థ నుండి అటువంటి మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూద్దాం.

జియో vs ఎయిర్టెల్ vs వోడాఫోన్ vs ఐడియా : 4G బెస్ట్ 3 నెలల ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్రతి ఒక్కరూ కూడా తాము ఖర్చు చెసే ప్రతి ఒక్క రూపాయికి తగిన ఫలితాన్ని ఆశిస్తారు. ప్రస్తుత, టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు వాడడం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా, చాటింగ్, షోషల్ మీడియా, గేమింగ్ మరియు మూవీస్ వంటి వారికోసం వీటిని వాడుతున్నారు. అటువంటి వాటికోసం, ఒక  స్మార్ట్ ఫోనుకు డేటా కూడా ఎక్కువగా అవసరమవుతుంది. అలాగే, జియో, ఎయిర్టెల్ , వోడాఫోన్ మరియు ఐడియా వాటి టెలికం సంస్థలు మూడు నెలలకు సరిపడా డేటా మరియు వాయిస్ కాలింగ్ తో మంచి ప్రీపెయిడ్ ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే, ఖర్చు పెట్టె డబ్బుకు తగిన విలువను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ మాత్రం అందులో కొన్ని మాత్రమే వున్నాయి. కాబట్టి, ఈ అన్ని టెలికం సంస్థ నుండి అటువంటి మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూద్దాం.              

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రిలయన్స్ జియో 449 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

మూడు నెలల కోసం రీచార్జి చేయాలనుకునే వారికి, రిలయన్స్ జియో యొక్క ఈ 398 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ నిజంగా సరిగ్గా సరిపోతుంది. ఇది రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 136.5 GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది. రోమింగ్ కూడా అపరిమితంగా ఉచితం, రోమింగ్ ఛార్జీలు లేవు. ఇది 91 రోజులు, అంటే పూర్తిగా మూడు నెలలు చెల్లుబాటుతో వస్తుంది. దీన్ని MyJio ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

భారతి ఎయిర్టెల్  448 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీని కోసం మీరు భారతి ఎయిర్టెల్ 448 రూపాయల రీఛార్జ్ చేయాలి. దీనితో, రోజువారీ 1.5GB డేటా అందుబాటులో ఉన్న అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ ఉన్నాయి. అయితే, ఎస్ఎంఎస్ పరిమితంగా ఉంటుంది, ఒక్కో రోజుకు 100 SMS లు మాత్రమే ఉంటుంది. అధనంగా, ఎయిర్టెల్ లైవ్ టీవీకి ఉచితంగా యాక్సెస్ పొందవచ్చు.  అలాగే, ఎయిర్టెల్ ఇప్పుడు పాన్ ఇండియా ఉచిత రోమింగ్ కలిగి ఉంది . ఇది 90 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. దీనిని మై ఎయిర్టెల్ యాప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

వోడాఫోన్ 509 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ యొక్క 509 రూపాయల వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో రోజువారీ 1.4 GB డేటాతో మొత్తంగా 126GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది.  రోమింగ్ ఉచితం మరియు రోమింగ్ ఛార్జీలు కూడా ఉండవు. ఇది 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మై  వోడాఫోన్ ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

ఐడియా 509 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

ఐడియా యొక్క 509 రూపాయల వినియోగదారులకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో రోజువారీ 1.5 GB డేటాతో మొత్తంగా 135 GB డేటా అందిస్తుంది, అలాగే అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ అందిబాటులో ఉంటాయి. రోజుకు కేవలం 100 SMSల పరిమితితో ఉంటుంది.  రోమింగ్ ఉచితం మరియు రోమింగ్ ఛార్జీలు కూడా ఉండవు. ఇది 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మై  ఐడియా ఆప్ లేదా రీఛార్జ్ దుకాణాలలో పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo