JIO NEW YEAR OFFER 2024: అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ అందించిన జియో.!

HIGHLIGHTS

అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ అందించిన జియో

JIO NEW YEAR OFFER 2024 ధమాకా ఆఫర్

అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ వంటి లాభాలను పొందవచ్చు

JIO NEW YEAR OFFER 2024: అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ అందించిన జియో.!

JIO NEW YEAR OFFER 2024: రిలయన్స్ జియో యూజర్ల కోసం కొత్త సందర్బంగా అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ అందించిన జియో. దేశవ్యాప్తంగా అత్యధిక యూజర్లను కలిగి ఉన్న రిలయన్స్ జియో, 2024 సంవత్సర కానుకగా ఈ ఆఫర్ ను అందించింది. ఈ ప్లాన్ తో అధిక వ్యాలిడిటీ మరియు అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ వంటి లాభాలను పొందవచ్చు. మరి రిలయన్స్ జియో అందిస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ పైన లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JIO NEW YEAR OFFER 2024

రిలయన్స్ జియో, 2024 సంవత్సర కానుకగా రూ. 2,999 రూపాయల ప్లాన్ పైన అధిక లాభాలను జతచేసింది. తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందిస్తున్న బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గా చెప్పబడే ఈ ప్లాన్ పైన మరిన్ని లాభాలను అందించింది జియో. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న పొర్హి లాభాలను వివరంగా ఇక్కడ చూడవచ్చు.

Also Read : Samsung Galaxy S23 5G పైన 14 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్.!

జియో రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అయితే, 2024 న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్లాన్ పైన 24 DAYS ఎక్స్ ట్రా వ్యాలిడిటీని జియో జత చేసింది. అంటే, న్యూ ఇయర్ ఆఫర్ ద్వారా ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసే యూజర్లు ఇప్పుడు పూర్తిగా 389 రోజులు చెల్లుబాటు అవుతుంది.

JIO NEW YEAR OFFER 2024
జియో రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ తో 389 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5 GB చొప్పున 912.5 GB ల 4G డేటాని అందిస్తుంది. అదే, 5జి నెట్ వర్క్ పైన అయితే పూర్తిగా అన్లిమిటెడ్ 5G డేటాని అందిస్తోంది రిలయన్స్ జియో. అలాగే, పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 100 SMS ఉపయోగ సౌకర్యాన్ని కూడా అందుకుంటారు.

అంతేకాదు, ఈ ప్లాన్ తో Jio TV, Jio Cinema మరియు Jio Cloud యాప్ లకు యాక్సెస్ ను కూడా అందిస్తుంది. జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ యాక్సెస్ కాదని గుర్తుంచుకోండి.

ఇమేజ్: జియో వెబ్సైట్ నుండి తీసుకోబడినది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo