Jio కస్టమర్లకు గుడ్ న్యూస్: భారీ ప్రయోజనాలతో కొత్త న్యూ ఇయర్ అఫర్ ప్రకటించింది.!
io Happy New year 2023 అఫర్ ను ప్రకటించింది
జియో హ్యాపీ న్యూ ఇయర్ 2023 అఫర్ తో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయని జియో తెలిపింది
కొత్త సంవత్సరం కోసం రిలయన్స్ జియో ధమాకా అఫర్
అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో రానున్న కొత్త సంవత్సరం కోసం తన కస్టమర్లకు Jio Happy New year 2023 అఫర్ ను ప్రకటించింది. జియో హ్యాపీ న్యూ ఇయర్ 2023 అఫర్ తో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయని జియో తెలిపింది. జియో కొత్తగా ప్రకటించిన ఈ Jio Happy New year 2023 అఫర్ ఏమిటి, ఈ అఫర్ లో వినియోగదారులకు లాభాలను అఫర్ చేస్తోంది, పూర్తి వైరాలు తెలుసుకుందామా.
SurveyJio Happy New year 2023:
రిలయన్స్ జియో కొత్త హ్యాపీ న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా కొత్త రూ.2023 రూపాయల ప్లాన్ ప్రకటించింది. అంతేకాదు, ఈ హ్యాపీ న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా ముందు నుండి కొనసాగుతున్న రూ.2,999 రూపాయల వన్ ఇయర్ ప్లాన్ లో మరిన్ని లాభాలను కూడా జతచేసింది. ఈ ప్లాన్ రూ.2023 రూపాయల మరియు రూ.2,999 అఫర్ చేస్తున్న లాభాలను ఇక్కడ చూడవచ్చు.
జియో కొత్త రూ.2,023 ప్రీపెయిడ్ ప్లాన్
జియో కొత్త రూ.2,023 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 630 GB డేటాని డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
జియో కొత్త రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల ఎక్ట్రా వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75 అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
అంతేకాదు, అర్హత కలిగిన వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G డేటాని కూడా ఈ ప్లాన్ లతో అందించనున్నట్లు కూడా తెలిపింది.
మరిన్ని జియో బెస్ట్ ఆఫర్ల కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile