జియో కొత్త అఫర్: రూ.749 రూపాయలకే 1 సంవత్సర అన్లిమిటెడ్ సర్వీసులు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 01 Mar 2021
HIGHLIGHTS
  • జియో మూడు కొత్త ఆఫర్లను విడుదల చేసింది

  • Jio అన్లిమిటెడ్ సర్వీస్ అందించే ప్లాన్

  • ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 1 సంవత్సరం అన్లిమిటెడ్ సర్వీస్

జియో కొత్త అఫర్: రూ.749 రూపాయలకే 1 సంవత్సర అన్లిమిటెడ్ సర్వీసులు
జియో కొత్త అఫర్: రూ.749 రూపాయలకే 1 సంవత్సర అన్లిమిటెడ్ సర్వీసులు

రిలయన్స్ జియో ఈరోజు మూడు కొత్త జియోఫోన్ ఆఫర్లను విడుదల చేసింది. వీటిలో రెండు ఆఫర్లు కొత్త జియోఫోన్ కొనుగోలుదారుల కోసం కాగా, ఒక అఫర్ మాత్రం ఇప్పటికే వున్నా జియోఫోన్ కస్టమర్ల కోసం ప్రకటించింది. ఇందులో, 1 సంవత్సరం మరియు 2 సంవత్సరాల అన్లిమిటెడ్ సర్వీసులను జత చేసింది.

అయితే, ఇప్పటికే వున్నా జియోఫోన్ కస్టమర్ల కోసం మాత్రం పూర్తిగా ఒక సంవత్సరం అంతా కాలింగ్, డేటా మరియు SMS లతో సహా అన్లిమిటెడ్ సర్వీస్ ను అందించే ప్లాన్ ను అందించింది. అయితే,  మీరు తెల్సుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ వున్నాయి. జియో యొక్క జియోఫోన్ లేటెస్ట్ అన్లిమిటెడ్ 749 రూపాయల ప్లాన్ కొన్ని కండిషన్స్ కలిగి వుంది.

జియోఫోన్ లేటెస్ట్ అన్లిమిటెడ్ 749 రూపాయల ప్లాన్ రీచార్జి చేస్తే మీకు మొత్తంగా 24GB డేటా లభిస్తుంది. అదికూడా నెలకు (28 రోజులకు) లకు 2GB చొప్పున 12 సైకిల్స్ (నెలలకు) ఈ 24 జీబీ డేటా ఇస్తుంది. అలాగే, SMS లు కూడా నెలకు (28 రోజులకు) 50 చొప్పున లిమిట్ సెట్ చేసింది. వ్యాలిడిటీ విషయంలో కూడా 1 సైకిల్ కి 28 రోజుల మొత్తం 12 సైకిల్స్ కి 336 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అయితే, కాలింగ్ మాత్రం ఎటువంటి లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ గా ప్రకటించింది. అధనంగా, జియో యాప్స్ కి యాక్సెస్ వుంటుంది.

logo
Raja Pullagura

email

Web Title: jio new rs 749 offer for jiophone existing customers
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status