Jio New Plans which offers gaming benefits and starts at rs 48 only
Jio New Plans: జియో యూజర్ల కోసం రిలయన్స్ జియో 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందించింది. ఈ ప్లాన్స్ కేవలం రూ. 48 రూపాయల నుంచి ప్రారంభం అవుతాయి. అయితే, వీటిలో మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ రెగ్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మాదిరిగా కాలింగ్ మరియు డేటా అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ కాదు. గేమింగ్ కోసం రిలయన్స్ జియో అందించిన JioGames Cloud కోసం యాక్సెస్ అందించే యాడ్ ఆన్ ప్యాక్ గా అందించింది. అయితే, ఇతర రెండు ప్లాన్స్ కాలింగ్, డేటా వంటి రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు జియో క్లౌడ్ గేమింగ్ ప్రయోజనాలు కూడా తీసుకొస్తాయి.
గేమింగ్ ప్రియుల కోసం రిలయన్స్ జియో 3 కొత్త గేమింగ్ యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. ఇందులో రూ. 48, 98 మరియు రూ. 298 మూడు ప్లాన్ లను అందించింది. అలాగే, రూ. 495 మరియు రూ. 545 రెగ్యులర్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్స్ అందించే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దామా.
రిలయన్స్ జియో యొక్క యాడ్ ఆన్ ఫ్యాక్స్ విషయానికి వస్తే, వీటిలో రూ. 48 ప్లాన్ 3 రోజులు మరియు రూ. 98 ప్లాన్ 7 రోజులు JioGames Cloud యాక్సెస్ అందిస్తాయి. అయితే, 298 ప్లాన్ మాత్రం 28 రోజుల జియో గేమ్స్ క్లౌడ్ బెనిఫిట్ మరియు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 3GB డేటా బెనిఫిట్ కూడా అందిస్తుంది.
జియో అందించిన ఈ రూ. 495 కొత్త గేమింగ్ ప్లాన్ 28 రోజుల అన్లిమిటెడ్ లాభాలు మరియు జియో గేమింగ్ తో సహా మరిన్ని లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1.5 తో పాటు 5GB అదనపు డేటా మరియు 100 SMS వంటి ప్రయోజనాలు అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 28 రోజుల JioGames Cloud యాక్సెస్, Fan Code యాక్సెస్ మరియు జియో హాట్ స్టార్ 90 రోజుల సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. ఇది కాకుండా జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు కూడా ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.
Also Read: Budget 5.1 Soundbar: గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 300W సౌండ్ బార్ డీల్.!
ఇక జియో యొక్క రూ. 545 గేమింగ్ ప్లాన్ ప్రయోజనాల గురించి చూస్తే, ఈ ప్లాన్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G లాభాలతో పాటు జియో గేమింగ్ వంటి మరిన్ని లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా, డైలీ 2 తో పాటు 5GB అదనపు డేటా మరియు 100 SMS ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అదనంగా, 90 రోజుల జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్, 28 రోజుల JioGames Cloud మరియు Fan Code యాక్సెస్ కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది. అంతేకాదు, 50 GB JioAICloud ఉచిత స్టోరేజ్ మరియు జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు కూడా ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా తీసుకొస్తుంది.