Jio New Plan: రిలయన్స్ జియో యూజర్లకు ప్రీమియం కంటెంట్ మరియు అన్లిమిటెడ్ లాభాలు అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లు 12 ప్రీమియం OTT యాప్స్ కి సబ్ స్క్రిప్షన్, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ డేటా వంటి అన్ని లాభాలను అందిస్తుంది. జియో ఆఫర్ చేస్తున్న ఆ ప్రీపెయిడ్ పాన్ ఏమిటి, ఆ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Jio New Plan:
టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత యూజర్లను ఆకట్టుకోవడానికి రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించే పనిలో పడింది. ఇందులో భాగంగా కొత్త రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకు వచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 12 OTT సబ్ స్క్రిప్షన్ లతో పాటు అన్లిమిటెడ్ డేట్ మరియు లాభాలు అందిస్తుంది.
జియో యొక్క రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కాలానికి అన్ని నెట్ నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ యూజర్లకు 4జి నెట్ వర్క్ పై రోజుకు 2GB చొప్పున టోటల్ 56 GB డేటాని మరియు జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా ఆఫర్ చేస్తుంది. అలాగే, డైలీ 100SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
అంతేకాదు, పైన తెలిపిన లాభాలతో పాటు 12 ప్రముఖ OTT లకు ఉచిత షబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అవేమిటంటే, Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,Fan Code మరియు Hoichoi ఓటీటీ యాప్స్ ను JioTV app ద్వారా చూడవచ్చు. అంతేకాదు, 28 రోజుల జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ తో లభిస్తుంది.