Jio New Plan: రూ. 198 కే అన్లిమిటెడ్ 5G డేటా మరియు కాలింగ్ తో కొత్త ప్లాన్ తెచ్చింది.!
జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తన పోర్ట్ ఫోలియో కి జత చేసింది
రిలయన్స్ జియో కొత్తగా రూ. 198 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకు వచ్చింది
అన్లిమిటెడ్ 5జి డేటా మరియు క్లెయింగ్ అందించే జియో చవక ప్లాన్
Jio New Plan: రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తన పోర్ట్ ఫోలియో కి జత చేసింది. రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ 5జి డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ వంటి మరిన్ని ప్రయోజనాలతో ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు చాలా వేగంగా జియో తీసుకువస్తోంది.
SurveyJio New Plan:
రిలయన్స్ జియో కొత్తగా రూ. 198 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకు వచ్చింది. ఈ ప్లాన్ గురించే మనం ఇప్పటి వరకు మాట్లాడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు ఇతర ప్రయోజనాలతో వచ్చే జియో చవక అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. మరి ఈ జియో అందించిన ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.
Jio Rs. 198 ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో యొక్క ఈ రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ 14 రోజులు 4జి నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా చొప్పున 28 GB డేటా మరియు Jio True 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా తో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా అందిస్తుంది. అదనంగా, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజు 100 SMS, జియో క్లౌడ్, జియో సినిమా మరియు జియో టీవీ యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

తక్కువ ఖర్చుతో మూడు నెలల అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ కూడా జియో తన యూజర్ల కోసం అందించింది. అదేమిటంటే, జియో ఇటీవల అందించిన రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 10 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది.
జియో రూ. 999 ప్లాన్
జియో రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి రోజు 2 GB డేటా చొప్పున 196 GB ల డేటాని 4జి నెట్ వర్క్ పై అందిస్తుంది. అలాగే, 5 జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ప్రతి రోజు 100 SMS ప్రయోజనం కూడా చేకూరుతుంది.
ఇది కాకుండా జియో క్లౌడ్, జియో సినిమా మరియు జియో టీవీ యాప్స్ కి యాక్సెస్ ను కూడా జియో అందిస్తుంది.
మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile