Jio Cinema కోసం New Plans తీసుకు వస్తున్న జియో..!
New Plan తీసుకొస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది
Jio Cinema ఈ కొత్త ప్లాన్ లను గురించి టీజింగ్ కూడా మొదలు పెట్టింది
ఎటువంటి యాడ్స్ లేకుండా కొత్త ప్లాన్ ని తీసుకు వస్తున్నట్లు Jio తెలిపింది
Jio Cinema కోసం New Plan తీసుకొస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఉచిత IPL మ్యాచ్ లతో యావత్ భారతదేశ ప్రజల మనసు దోచుకుంది రిలయన్స్ జియో. అయితే, ఇప్పుడు జియో సినిమా లో ఎటువంటి యాడ్స్ లేకుండా కొత్త ప్లాన్ ని తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త ప్లాన్ లను గురించి టీజింగ్ కూడా మొదలు పెట్టింది.
Surveyదేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రజల్లో పెరుగుతున్న OTT ఎంటర్టైన్మెంట్ ట్రెండ్ కు తగిన విధంగా జియో సినిమా యాప్ OTT ప్లాట్ ఫామ్ ను జియో తీసుకు వచ్చింది. ముందుగా ఉచిత సబ్ స్క్రిప్షన్ లను ప్రోత్సహించిన జియో, IPL మ్యాచ్ లను ఉచితంగా వీక్షించే అవకాశం కూడా అందించింది.
క్రికెట్ మ్యాచ్ లను, అందులోనూ IPL మ్యాచ్ లను అధికంగా ఇష్టపడే ప్రజలు జియో సినిమా లో భారీ మొత్తంలో సబ్ స్క్రైబర్ బేస్ ను నమోదు అయ్యేలా చేసింది. అయితే, జియో ఇటీవల జియో సినిమా కోసం Premium ప్లాన్ కూడా అందించింది. అయితే, ప్రస్తుతానికి జియో సినిమా కోసం కేవలం రూ. 999 లేదా నెలకు రూ. 99 రూపాయలతో కూడిన సింగిల్ ప్లాన్ మాత్రమే అందుబాటులో వుంది.
Also Read: OTP మోసాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి New Tech తెస్తున్న ప్రభుత్వం.!
Jio Cinema New Plan
అయితే, జియో అధికారిక X (ట్విట్టర్) అకౌంట్ నుండి అందించిన కొత్త టీజర్ ద్వారా జియో సినిమా కోసం కొత్త ప్లాన్స్ లాంఛ్ గురించి ప్రస్తావించింది. జియో ట్వీట్ లో “A New Plan” అని మాత్రమే తెలిపింది. ఈ కొత్త ప్లాన్ ను ఏప్రిల్ 25 వ తేదీ ప్రకటించనున్నట్లు కూడా డేట్ అనౌన్స్ చేసింది.

ఈ ట్వీట్ నుండి జియో సినిమా అప్ కమింగ్ ప్లాన్స్ యొక్క ఒక్క విషయాన్ని మాత్రమే సూచించింది. అదేమిటంటే, ఈ ప్లాన్ లను ఎటువంటి యాడ్స్ లేకుండా ‘Ad Free’ గా తీసుకు వస్తోందని అర్థం అవుతోంది.
అయితే, ఈ అప్ కమింగ్ జియో సినిమా కొత్త ప్లాన్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి ఇతర వివరాలు వెల్లడించ లేదు. మరి చూడాలి జియో సినిమా కోసం ఎటువంటి కొత్త ప్లాన్ లన్నియు తీసుకు వస్తుందో.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile