ఎంపిక చేసిన సర్కిళ్లలో JIO VoWi-Fi సేవలు మొదలు : ఎయిర్టెల్ మరికొన్ని సర్కిలను ఈ VoWi-Fi సేవలో యాడ్ చేసింది

ఎంపిక చేసిన సర్కిళ్లలో JIO VoWi-Fi సేవలు మొదలు : ఎయిర్టెల్ మరికొన్ని సర్కిలను ఈ VoWi-Fi సేవలో యాడ్ చేసింది
HIGHLIGHTS

అన్ని సర్కిళ్లకు కూడా తీసుకొచ్చేందుకు కూడా జియో తొందరపడవచ్చు.

గడిచిన కొన్ని సంవత్సరాలలో తమ సగటు వినియోగదారు ఆదాయం (ARPU) గణనీయంగా పడిపోయిన కారణంగా, ప్రధాన టెలికం సంస్థలు అన్ని కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు, వినియోగధారుల తలపైన అదనపు భారాన్ని పెట్టాయి అన్నది, విస్మరించలేని వాస్తవం. ఇందులో భాగంగా, ప్రధాన టెలికం సంస్థలు అయునటివంటి, జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను అమాంతంగా పెంచేసి, తమ వినియోగధారులను అధిక భారం దిశగా నెట్టేశాయి అని అనిపిస్తుంది.

అయితే, తమ వినియోగదారులు మోస్తున్న అధిక ధరల భారాన్నితగ్గించేందుకు, ఈ ప్రధాన టెలికం సంస్థలు తమ ఇతర ప్రయత్నాలు మరియు ప్రత్యామ్నాయాలను కూడా తీసుకురావడం మొదలు పెట్టాయి. ఇదే దిశలో, రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం, ఎంపిక చేసిన సర్కిళ్లలో తన VoWi-Fi సేవలను ప్రారంభిచింది. ప్రస్తుతానికి, ఈసేవలను ఢిల్లీ NCR మరియు చెన్నై సర్కిళ్లలో ప్రకటించింది. అయితే, ఈ ఈ సేవను త్వరలోనే తన అన్ని సర్కిళ్లకు కూడా తీసుకొచ్చేందుకు కూడా జియో తొందరపడవచ్చు.

అయితే, ముందు నుండే  సౌత్ సర్కిళ్లు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సర్కిళ్ళతో పాటుగా ముంబై మరియు కలకత్తా వాటి సిటీలలో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు, ఈ సర్కిళ్ళతో పాటుగా గుజరాత్, UP (West) మరియు కేరళ సర్కిళ్లలో ఈ సేవలను ప్రకటించింది. కాబట్టి, పైన తెలిపిన సర్కిళ్లలో VoWi-Fi సేవలను వినియోగదారులు వినియోగించుకోవచ్చు.                                                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo